ఈ విషయాన్ని పట్టించుకోకుండా కాలేజీ ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. యువతి అత్యాచారాన్ని ఆత్మహత్యగా ఎందుకు ప్రకటించారు? అని ప్రశ్నించింది.
న్యూస్ లైన్ డెస్క్: కోల్‌కతాలోని RGకర్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన కేసుపై సుప్రీం కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ కేసును సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఈ కేసుపై విచారణ జరిపారు.
మహిళలు, వైద్యుల భద్రతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన భయానకం. 12 గంటలు ఆలస్యంగా ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేశారు? అని పోలీసులను ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని పట్టించుకోకుండా కాలేజీ ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. యువతి అత్యాచారాన్ని ఆత్మహత్యగా ఎందుకు ప్రకటించారు? అని ప్రశ్నించింది.
కోల్‌కతా ఘటనపై అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై గురువారంలోగా దర్యాప్తు స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని సీబీఐకి కోర్టు ఆదేశించింది. భద్రత కోసం జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని సుప్రీం తెలిపింది. అయితే, ఈ మేరకే డాక్టర్ల భద్రతపై 10 మంది సీనియర్ డాక్టర్లతో నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.
ఈ ఘటనలో మృతిచెందిన యువతికి న్యాయం చేయాలని, నిందితులకు శిక్ష పడేలా చేయాలని దేశవ్యాప్తంగా డాక్టర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. వారంతా తిరిగి విధుల్లో చేరాలని సుప్రీం ఆదేశించింది.