. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ , మాజీ ప్లేయర్ రవిశాస్త్రితో పాటు పలువురు మాజీలు, క్రికెటర్లు రతన్ టాటాకు నివాళులర్పించారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రముఖ పారిశ్రామిక వేత్త , టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా లేరనే విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ముంబాయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ఆయన చనిపోయారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ , మాజీ ప్లేయర్ రవిశాస్త్రితో పాటు పలువురు మాజీలు, క్రికెటర్లు రతన్ టాటాకు నివాళులర్పించారు.
మిస్టర్ రతన్ టాటా తన జీవితంలోనే కాదు మరణంలోనూ దేశాన్ని కదిలించారు. నేను ఆయనతో కలిసి కాస్త సమయం గడిపాను. కాని ఎప్పుడు చూడని వారు ..ఎప్పుడు కలవని వారు కూడా రతన్ టాటా మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
స్తోమత లేని వారి పట్ల మనం శ్రద్ధ వహించినప్పుడే నిజమైన పురోగతిని సాధించగలమని టాటా చూపించారు. మిస్టర్ టాటా. మీరు నిర్మించిన సంస్థలు, మీ వారసత్వం కొనసాగుతుంది' అని సచిన్ తెందూల్కర్
'రతన్ టాటాది బంగారంలాంటి మనసు. ఆయన బ్రతికినంత కాలం జనాల కోసమే బ్రతికారు.- రోహిత్ శర్మ
'ఎక్సలెన్స్, విజన్, వినయానికి ప్రతీక. ఇది సమాజానికి తీరని నష్టం. ' - రవిశాస్త్రి
'మనం అసలైన భారత రతనాన్ని కోల్పోయాం. ఆయన జీవితం మనందరికీ స్ఫూర్తి. మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతారు. ఓం శాంతి' - సేహ్వాగ్
'గొప్ప నాయకుడిని కోల్పోవడం బాధాకరం. మీరు చేసిన సహకారాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి'- ధావన్
భారత్ నిజమైన మకుటాన్ని కోల్పోయిందని తెలిపారు ప్రముఖులు. రతన్ టాటా లాంటి వ్యక్తి మళ్లీ ఈ నేలపై రావడం కష్టమని అభిప్రాయపడ్డారు.