దాదాపు నాలుగైదు నెలల నుంచి మీడియా అంబానీ పెళ్లి ప్రతి విషాయాన్ని కవర్ చేస్తుంది. డబ్బు కాదు అది ..చిత్తు కాగితాలు అన్నట్లు విసురుతున్నారు అదే ఖర్చు పెట్టారు. దానాలు చేశారు, ధర్మాలు చేశారు, ఎన్నో వందల జంటలకు సామూహిక పెళ్లిళ్లు చేశారు. పెళ్లి తంతు మాత్రం భారీ తారాగనం, సెలబ్రెటీస్ , దేశ విదేశాల వారికి పిలుచుకున్నారు. ఇక ఈ తంతు దగ్గరుండి చూడాలని ఏపీ నుంచి ఇద్దరు కుర్రాళ్లు పిలవని పేరంటానికి ...ముంబై వెళ్లారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దాదాపు నాలుగైదు నెలల నుంచి మీడియా అంబానీ పెళ్లి ప్రతి విషాయాన్ని కవర్ చేస్తుంది. డబ్బు కాదు అది ..చిత్తు కాగితాలు అన్నట్లు విసురుతున్నారు అదే ఖర్చు పెట్టారు. దానాలు చేశారు, ధర్మాలు చేశారు, ఎన్నో వందల జంటలకు సామూహిక పెళ్లిళ్లు చేశారు. పెళ్లి తంతు మాత్రం భారీ తారాగనం, సెలబ్రెటీస్ , దేశ విదేశాల వారికి పిలుచుకున్నారు. ఇక ఈ తంతు దగ్గరుండి చూడాలని ఏపీ నుంచి ఇద్దరు కుర్రాళ్లు పిలవని పేరంటానికి ...ముంబై వెళ్లారు.
తాజాగా, అనంత్ అంబానీ పెళ్లికి ఆహ్వానం లేకుండా వెళ్లిన ఇద్దరు ఏపీ యువకులపై కేసు నమోదైంది. వారిద్దరిలో అల్లూరి వెంకటేశ్ అనే యువకుడు యూట్యూబర్. మరో యువకుడి పేరు షఫీ షేక్. ఏపీకి చెందిన ఆ యూట్యూబర్ పేరు ఆలూరి వెంకటేష్. వయస్సు 26 సంవత్సరాలు. అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ పెళ్లి రోజైన శుక్రవారం నాడు ఉదయం జియో వరల్డ్ సెంటర్ గేట్ నంబర్ 23 గుండా లోనికి వెళ్లడానికి ప్రయత్నించాడు. తన దగ్గర పాస్ కాని ..వెడ్డింగ్ కార్డు కాని లేకపోవడంతో పోలీసులకు దొరికిపోయాడు.
షఫీ గేట్ 19 గుండా జియో వరల్డ్ సెంటర్‌లోకి వెళ్లగలిగాడు. కాని అతను కాస్త అనుమానంగా కనిపించేసరికి .. అతన్ని పట్టుకుని, బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. తన యూట్యూబ్ ఛానెల్ కోసం కంటెంట్‌ను చిత్రీకరించాలనుకుంటున్నట్లు అతను తన నేరాన్ని అంగీకరించినట్లు బీకేసీ పోలీసులు తెలిపారు. అతనిపై సెక్షన్ 329 కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. విరార్‌కు చెందిన మరో వ్యక్తి మహ్మద్ షఫీ షేఖ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.