Cupboard Bunker: కాశ్మీర్ లో టెర్రరిస్టు స్థావరం ఎలా కట్టుకున్నారో .. వీడియో ఇదిగో!

జమ్మూ కాశ్మీర్  లోని కుల్గామ్ లో భద్రతా బలగాలు ఆరుగురు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సంగతి తెలుసు కదా...ఈ ఎన్ కౌంటర్లలో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. ఈ ఎన్ కౌంటర్లు తర్వాత భధ్రతాబలగాలు ఓ ఇంట్లోని కప్ బోర్డు అనుమానంగా అనిపించడం తో డీప్ గా చెక్ చేశారు. లోపల ఓ పెద్ద రూమ్ ని కట్టుకున్నారు. ఈ బంకర్ కు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ నేత ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. చూడడానికి మామూలు కప్ బోర్డ్ లానే ఉన్నా లోపల మాత్రం కాంక్రీట్ తో టెర్రరిస్టులు బంకర్ ను నిర్మించుకున్నారు.


Published Jul 08, 2024 02:50:03 AM
postImages/2024-07-08/1720424870_images2.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: జమ్మూ కాశ్మీర్  లోని కుల్గామ్ లో భద్రతా బలగాలు ఆరుగురు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సంగతి తెలుసు కదా...ఈ ఎన్ కౌంటర్లలో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. ఈ ఎన్ కౌంటర్లు తర్వాత భధ్రతాబలగాలు ఓ ఇంట్లోని కప్ బోర్డు అనుమానంగా అనిపించడం తో డీప్ గా చెక్ చేశారు. లోపల ఓ పెద్ద రూమ్ ని కట్టుకున్నారు. ఈ బంకర్ కు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ నేత ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. చూడడానికి మామూలు కప్ బోర్డ్ లానే ఉన్నా లోపల మాత్రం కాంక్రీట్ తో టెర్రరిస్టులు బంకర్ ను నిర్మించుకున్నారు.


టెర్రరిస్ట్ ఎన్ కౌంటర్ల తర్వాత చిన్నిగామ్‌ ఫీసల్‌లోని  ప్రతి ఇంటిని తనిఖీలు చేపట్టారు.ఈ సోదాల్లో ఈ కప్ బోర్డ్ కాస్త అనుమానంగా కనిపించింది. కప్ బోర్డ్ ను పరిశీలించగా..ఓ డోర్ కనపడిందని అధికారులు చెబుతున్నారు.ఆ డోర్ ఓపెన్ చేస్తే లోపల ఇద్దరు వ్యక్తులు దాక్కునేందుకు వీలు కల్పించే బంకర్ బయటపడిందన్నారు. కాంక్రీట్ తో పటిష్ఠంగా కట్టిన ఈ బంకర్ లోకి పాక్కుంటూ వెళ్లాల్సిందే. లోపల మాత్రం నిటారుగా నిల్చునేందుకు వీలుంది.


గతంలోను జమ్మూకశ్మీర్ లోని గ్రామాల్లో ఉగ్రవాదులు బాత్ రూమ్ కింద రహస్య స్థావరాలు నిర్మించుకున్నారని సైనిక అధికారులు తెలిపారు. 2019లో లస్సీపురలోని ఓ ఇంటిలో సోదాలు జరిపినపుడు బంకర్ గుర్తించామని, అందులో దాక్కున్న ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టామని చెప్పారు. పక్కా ఇన్ఫర్మేషన్ తో ...దాదాపు ఆరు సార్లు ఇళ్లు మొత్తం సోదా చేస్తే ఈ బంకర్ దొరికిందని తెలిపారు పోలీసులు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news police

Related Articles