Viral video:మళ్లీ స్టార్ట్ అయిన బుల్లెట్ బండి..నీ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా..?

ఎప్పుడు పెళ్లిలో సీజన్ వచ్చినా బరాత్ లో తప్పకుండా ఈ పాట ఉండాల్సిందే. పాటకు వధూవరులిద్దరు స్టెప్పులు వేయాల్సిందే. ఈ పాట రియల్ గా పాడి డాన్స్ చేసిన మోహన భోగరాజుకు అంతగా పేరు


Published Aug 28, 2024 11:11:14 AM
postImages/2024-08-28/1724823674_bullet.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఎప్పుడు పెళ్లిలో సీజన్ వచ్చినా బరాత్ లో తప్పకుండా ఈ పాట ఉండాల్సిందే. పాటకు వధూవరులిద్దరు స్టెప్పులు వేయాల్సిందే. ఈ పాట రియల్ గా పాడి డాన్స్ చేసిన మోహన భోగరాజుకు అంతగా పేరు రాలేదు కానీ ఈ పాటపై స్టెప్పులు వేసిన పెళ్లికూతురులు చాలా వైరల్ అయ్యారు.  ఇప్పటికే ఎన్ని పెళ్లి బరత్ లు జరిగినా అందులో పెళ్లికూతురు తప్పకుండా బుల్లెట్ బండి సాంగ్ పై డాన్స్ చేస్తూ ఉంటారు. అలా ఈ సాంగ్ విపరీతంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా వైరల్ అయిపోయింది.

ప్రతి పెళ్లిఘట్టంలో ఈ పాట కీలకమైంది. సాధారణంగా పెళ్లి తంతు ముగిసిన తర్వాత చివరి ఘట్టమైన బరాత్ నిర్వహిస్తారు. చాలామంది పెళ్లికూతుర్లు బుల్లెట్ బండి సాంగ్ పై తప్పకుండా డ్యాన్స్ చేస్తున్నారు. అంతేకాదు ఆ డ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అధికాస్త వైరల్ గా మారుతుంది. ఈ విధంగా ఎంతో సెన్సేషన్  అయినటువంటి బుల్లెట్ బండి సాంగ్ సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతుంది.  

https://www.instagram.com/reel/C_GK4VLM6VL/?igsh=MTQ4azNveHdqODJqaA==

పెళ్లి చేసుకున్నటువంటి ఒక వధువు తన భర్తతో "నీ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తాగా.. డుగ్గు డుగ్గు" అంటూ డాన్స్ చేస్తూ అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. అయితే ఈ డాన్స్ వీడియోను మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. వాస్తవానికి ఈ పాట రచయిత లక్ష్మణ్, ఈ పాటను పాడుతూ డాన్స్ చేసింది మోహన భోగరాజు. ఎస్ జె బాజీ సంగీతమందించారు. అలాంటి ఈ పాట సోషల్ మీడియాలో పెళ్లిళ్ల సీజన్ లో ప్రతిసారి వైరల్ అవుతుంది. అయితే తాజాగా సాయిశ్రీజా అనే పెళ్లికూతురు ఈ పాటకు డ్యాన్స్ చేస్తూ  అలరించింది దీంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu sreeja mohana-bogaraju bullet-bandi-song bride-dance

Related Articles