VIRAL: లంచ్ బాక్స్ లో బిర్యానీ తెచ్చాడని ..స్కూల్ వాళ్లు ఏం చేశారో తెలుసా !

చికెన్ బిర్యానీ కారణంగా ఓ విద్యార్థి స్కూల్ అడ్మిషన్ రద్దైంది. బిర్యానీ కారణంగా  అడ్మిషన్ రద్దు చేశారు స్కూల్ యాజమాన్యం.


Published Sep 12, 2024 11:31:00 PM
postImages/2024-09-12/1726164099_chickenBiryani848x477.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: చాలా మందికి బిర్యానీ అంటే మహా ఇష్టం. మసాలా వాసన చూస్తేనే నాషాలానికి సెగలు పుడతాయి. తప్పులేదు రుచి అలాంటిది. చాలా మందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. మరికొంతమంది బిర్యానీ అంటే గంట ముందే ఆకలి వేసేస్తుంది. అయితే ఓ ప్రాంతంలో చికెన్ బిర్యానీ పెద్ద రచ్చే చేసింది. చికెన్ బిర్యానీ కారణంగా ఓ విద్యార్థి స్కూల్ అడ్మిషన్ రద్దైంది. బిర్యానీ కారణంగా  అడ్మిషన్ రద్దు చేశారు స్కూల్ యాజమాన్యం.


రాజస్థాన్ లోని అమ్రోహా ప్రాంతంలోని హిల్టన్ పబ్లిక్ స్కూల్‌లో ఏడేళ్ల బాలుడు చదువుతోన్నాడు. గత గురువారం లంచ్ బాక్సులో చికెన్ బిర్యానీ తెచ్చుకున్నాడు. స్కూల్ కు నాన్ వెజ్ తెచ్చుకున్నందుకు గాను తన అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తున్నామని తెలిపారు.స్కూల్ యాజమాన్యంకి, బాలుడి తల్లిదండ్రుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తన ముగ్గురు పిల్లలకి టీసీ ఇవ్వాలని కోరగా అడ్మిషన్ క్యాన్సిల్ చేసింది స్కూల్ యాజమాన్యం.


ఇక ఆ పిల్లల అడ్మిషన్‌కు అయ్యే ఖర్చును భరించేందుకు విద్యా శాఖ ముందుకొచ్చింది. అలాగే, హిల్టన్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం బకాయి ఉన్న రూ. 37 వేల  ఫీజును మాఫీ చేయడానికి అంగీకరించింది. వెంటనే ప్రిన్సిపాల్‌ ను రెండు రోజుల కిందట సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ లో ను ఇదే సీన్ జరిగింది.
 

newsline-whatsapp-channel
Tags : viral food-habits biryani school

Related Articles