మీ చిల్డ్రన్స్ స్కూల్ నుంచి వచ్చాక ఈ ప్రశ్నలు అడగాల్సిందే.?

చాలామంది తల్లిదండ్రులు చిన్న పిల్లల్ని  స్కూల్ కు పంపిన తర్వాత చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. వారి పిల్లలు స్కూల్లో ఎలా ఉన్నారో, అసలు ఏం తిన్నారో, తినలేదో అసలు మిగతా పిల్లలతో ఎలా ఉన్నారు. అనే విషయంలో కంగారు పడుతూ ఉంటారు. స్కూలుకు పంపినప్పటి నుంచి వాళ్లు స్కూల్ నుంచి వచ్చేవరకు వారి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. పిల్లవాడు ఏడుస్తున్నాడా?


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-10/1720614473_child.jpg

న్యూస్ లైన్ డెస్క్: చాలామంది తల్లిదండ్రులు చిన్న పిల్లల్ని  స్కూల్ కు పంపిన తర్వాత చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. వారి పిల్లలు స్కూల్లో ఎలా ఉన్నారో, అసలు ఏం తిన్నారో, తినలేదో అసలు మిగతా పిల్లలతో ఎలా ఉన్నారు. అనే విషయంలో కంగారు పడుతూ ఉంటారు. స్కూలుకు పంపినప్పటి నుంచి వాళ్లు స్కూల్ నుంచి వచ్చేవరకు వారి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. పిల్లవాడు ఏడుస్తున్నాడా?

టీచర్లతో ఎలా మెదుగుతున్నారు  టీచర్లు ఏమైనా అంటున్నారా అనే విషయంలో కూడా తల్లిదండ్రులు ఇంటి వద్ద కంగారు పడుతూ ఉంటారు. ఆ విధంగా ఆలోచించే తల్లిదండ్రులు తప్పనిసరిగా మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఈ ప్రశ్నలు తప్పనిసరిగా అడగండి. వారు చెప్పిన సమాధానాన్ని బట్టి పిల్లలు స్కూల్లో ఎలా ఉంటున్నారు అర్థం చేసుకోవచ్చు. 

 ఆరోజు జరిగిన విషయాల గురించి:
 ముఖ్యంగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే దగ్గరికి తీసుకొని ఆప్యాయంగా పలకరించాలి. ఆరోజు స్కూల్లో ఏ ఏ ప్రోగ్రామ్స్ జరిగాయి టీచర్స్  ఏం చెప్పారు. ఏమైనా గేమ్స్ ఆడారా.. విషయాలపై ఆరా తీయాలట. ఆ పిల్లలు ఇచ్చే సమాధానం బట్టి స్కూల్లో ఏం జరుగుతుందో తప్పనిసరిగా మీకు తెలుస్తుంది. 

 ఆహారం:
 చాలామంది తల్లిదండ్రులు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే  వారి టిఫిన్ బాక్స్ తీసి చూస్తూ ఉంటారు. మొత్తం తిన్నారా లేదా అనే విషయంపై చూస్తారు. అలా చూసిన తర్వాత ఈరోజు ఫుడ్ బాగుందా, రోజు ఇలాగే పెట్టాలా, మీ స్నేహితులు ఎలాంటి ఫుడ్ తీసుకువచ్చారు అనే విషయంపై అడగండి. దీనివల్ల వారికి ఎలాంటి ఇష్టమైన ఆహారం కావాలనిపిస్తుందో తెలుసుకోవచ్చు. 

 స్నేహితుల గురించి:
 పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వారు యూనిఫామ్ విప్పుతూనే మీ స్కూల్లో స్నేహితులు ఏమైనా అన్నారా.. వారు ఏం మాట్లాడారు వారితో ఇవాళ ఏం గేమ్స్ ఆడారు అనే విషయాలపై ఆరా తీయండి. ఎవరైనా కొట్టారా, ఏడుస్తున్నారా అంటూ అడగండి.  దీనివల్ల మీ పిల్లల్ని స్కూల్లో ఎవరైనా పరాయి పిల్లలు ఇబ్బందులు పెడితే ఆ సమయంలో చెబుతారు. 

 కౌగిలించుకోవడం :
 ముఖ్యంగా మీ పిల్లాడు స్కూల్ నుంచి రాగానే మొదట అతని ప్రేమతో కౌగిలించుకోండి. దీంతో పిల్లాడికి  అనుభూతి కలగడమే కాకుండా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత  శుభ్రంగా కాళ్లు చేతులు కడిగించి  ఏవైనా స్నాక్స్ కావాలంటే ఇవ్వండి.

 హోంవర్క్ :
 ఇక అన్ని అడిగిన తర్వాత చివరికి, వాళ్ల టీచర్ ఏం చెప్పింది ఎలాంటి హోంవర్క్ ఇచ్చింది అనే విషయంపై ఆరా తీయండి. వారు చెప్పిన దాన్నిబట్టి హోంవర్క్ ఏంటో వారితో చేయించండి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu childrens school parents

Related Articles