ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి యదార్ధ ఘటన గురించే చూపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ జిల్లా ఒక ఆధ్యాత్మిక ఉత్సవానికి వెళ్ళినటువంటి దాదాపు నూట ఇరవై మందికి పైగా అమాయకులు మరణించారు. కాకుండా ఈ కార్యక్రమంలో వందలాదిమంది గాయపడ్డారు. పూర్తి వివరాలు ఏంటో చూద్దాం.. సాకార్ విశ్వహరి భోలే బాబా అని పిలుచుకునే అటువంటి నారాయణసాకర్ నిర్వహించినటువంటి సత్సంగం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి లక్షలాదిమందిని తరలివచ్చారు. ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగి 120 మందికి పైగా అమాయక భక్తులు మరణించారు.
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి యదార్ధ ఘటన గురించే చూపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ జిల్లా ఒక ఆధ్యాత్మిక ఉత్సవానికి వెళ్ళినటువంటి దాదాపు నూట ఇరవై మందికి పైగా అమాయకులు మరణించారు. కాకుండా ఈ కార్యక్రమంలో వందలాదిమంది గాయపడ్డారు. పూర్తి వివరాలు ఏంటో చూద్దాం.. సాకార్ విశ్వహరి భోలే బాబా అని పిలుచుకునే అటువంటి నారాయణసాకర్ నిర్వహించినటువంటి సత్సంగం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి లక్షలాదిమందిని తరలివచ్చారు. ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగి 120 మందికి పైగా అమాయక భక్తులు మరణించారు.
బోలె బాబా అసలు పేరు సూరజ్ పాల్. ఈయన ఉత్తరప్రదేశ్ పోలీస్ విభాగంలో పనిచేసేవారు. అయితే 2006లో ఈయన విఆర్ఎస్ తీసుకొని బోలె బాబాగా మారిపోయాడు. తనకు ఎవరూ గురువులు లేరని భగవంతుడే తనని జ్ఞానాన్ని కలిగిస్తున్నాడని చెప్పుకుంటూ అమాయక ప్రజలను నమ్మించాడు. ముందుగా తన సొంత ఊరిలో గుడిసె వేసుకొని ఆధ్యాత్మిక ఉపదేశాలు చేస్తూ వచ్చాడు. అలా కొద్దికొద్దిగా ఫేమస్ అయినటువంటి బోలె బాబా ఉత్తరప్రదేశ్ కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా లక్షలాదిమంది భక్తులను సంపాదించుకున్నాడు. ఈయన సత్సంగ్ పేరుతో భారీగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేస్తాడు.
https://x.com/ChotaNewsTelugu/status/1808804688713945248?s=19
ఈ కార్యక్రమాల్లో తన భార్యతో పాటు ఆసనంలో కూర్చొని బోధనలు అందిస్తాడు బోలే బాబా. అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత బోలె బాబాకు చెందిన అనుచరులు భక్తులకు జలాన్ని అందిస్తారు. ఈ జలం తాగితే రోగాలు దూరం అవుతాయని భక్తుల యొక్క నమ్మకం. దీన్ని క్యాచ్ చేసుకున్న బోలె బాబా ప్రతి వారం కార్యక్రమాలు నిర్వహిస్తాడు. అయితే తాజాగా రాతిబాన్పూర్ లో నిర్వహించినటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తాను ఏర్పాటు చేసేటటువంటి స్థావరంలోకి లక్షలాదిమంది భక్తులు చేరడంతో అక్కడ ఉన్న అనుచరులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు.
దీంతో పెను విషాదం తలెత్తింది. మొత్తం 120 మందికి పైగా భక్తులు ఊపిరాడక తొక్కి సలాటలో మరణించారు. ఎంతోమంది భక్తులకు గాయాలయ్యాయి. మరి ఈ విధంగా సభలు, సమావేశాలు, ఏదైనా జాతరలు లాంటి వెళ్ళినప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలియదు. అయితే దీనిపై ఐపీఎస్ అధికారిని స్వాతి లక్రా ఒక వీడియోను షేర్ చేసింది. అనుకోకుండా తోకేసలాట జరిగినప్పుడు కింద పడిపోకుండా ఎలా కాపాడుకోవాలో పెట్టిన వీడియోలో ట్రైనర్ చూపించారు. రద్దీ ఎక్కువగా ఉండి కింద పడిపోయినప్పటికీ ఎలాంటి భంగిమలో తమకు తాము కాపాడుకోవచ్చు ప్రాక్టికల్ గా చేసి చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.