Robbery: ఏం దొంగలు రా మీరు...విచిత్రంగా అవేం దొంగతనాలు రా!

మూసారాంబాగ్ ప‌రిధిలోని ఈస్ట్ ప్ర‌శాంత్ న‌గ‌ర్‌లో దొంగ‌లు వింత చోరీకి పాల్ప‌డ్డారు. అపార్ట్‌మెంట్స్‌లో చొర‌బ‌డి చెప్పులు, బూట్లు ఎత్తుకెళ్లారు. 


Published Mar 13, 2025 06:33:00 PM
postImages/2025-03-13/1741871108_120067523095652thumbnail16x9shoes22.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : హైదరాబాద్ నగర పరిధిలో గత కొన్ని రోజులుగా రెచ్చిపోతున్నారు. చేతికి అందినవన్నీ దోచుకుంటారు. కాని ఇక్కడ అలా కాదు. దోపిడీ దొంగలు చెప్పుల దొంగలు. చెప్పులు . మీరు ఇంటి ముందు చెప్పులు చూస్తే చాలు రాత్రికి అవి మాయం. న‌గ‌రంలోని మూసారాంబాగ్ ప‌రిధిలోని ఈస్ట్ ప్ర‌శాంత్ న‌గ‌ర్‌లో దొంగ‌లు వింత చోరీకి పాల్ప‌డ్డారు. అపార్ట్‌మెంట్స్‌లో చొర‌బ‌డి చెప్పులు, బూట్లు ఎత్తుకెళ్లారు. 


సింగిల్ టైంలో నాలుగు అపార్ట్ మెంట్ లో దోపిడీకి పాల్పడ్డారు. ఉదయం బయటకు వచ్చి చూసిన అపార్ట్ మెంట్ వాసులకు తమ చెప్పులు , బూట్లు కనిపించలేదు. దీంతో ఆ ఏరియా వాసులంతా దగ్గర్లో ఉన్న బిల్డింగ్ సీసీ టీవీ ఫుటేజ్ ని పరిశీలించగా దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి షాకయ్యారు. చెప్పుల దొంగలు ...రాత్రికి రాత్రే ఓ నాలుగు , ఐదు మూటలు దోచేశారు . కొస మెరుపు ఏంటంటే బాధితుల్లో మ‌హిళా స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్, ఓ పోలీస్‌ ఇన్‌స్పెక్ట‌ర్ ఉండ‌టం. ఈ దొంగ‌త‌నానికి సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైనశైలిలో స్పందిస్తున్నారు.  

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu secundrabad viral-news thief-baba

Related Articles