24 క్యారెట్ స్వచ్ఛమైన గోల్డ్ రేటు 10 గ్రాముల ధర కూడా స్థిరంగానే ఉంది. అంటే రూ. 73,040 వద్ద ట్రేడవుతోంది
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బంగారం ధర ఇదే స్థాయిలో దిగి వస్తుందని భావించిన వారికి నిరాశే ఎదురయ్యింది. పది ఇరవై తగ్గుతుంది..వేలకు వేలు పెరుగుతుంది. బంగారం లో ఉండే కిటుకే అది. కాని ఎవ్వరి ఏం చెయ్యలేరు..ఇదంతా మార్కెట్ మాయాజాలం.అయితే ఈ రోజు 22 క్యారెట్ బంగారం రేటు పది గ్రాముల ధర స్థిరంగా రూ. 66,950 వద్ద కొనసాగుతుంది. అలానే 24 క్యారెట్ స్వచ్ఛమైన గోల్డ్ రేటు 10 గ్రాముల ధర కూడా స్థిరంగానే ఉంది. అంటే రూ. 73,040 వద్ద ట్రేడవుతోంది.దాదాపుగా నిన్నటి రేటే నమోదవుతుంది. ట్యాక్సుల్లో అది కాస్త పెరిగే పెరగొచ్చు అంతే.
ఇవాళ హైదరాబాద్ లో బంగారం రేటు స్థిరంగా ఉంది. గ్రాము బంగారం ధర 7500 ఉంది. ఢిల్లీలో కూడా అలానే ఉంది. నేడు హస్తినలో 22 క్యారెట్ పసిడి 10 గ్రాముల రేటు రూ. 67,100 వద్ద స్థిరంగా ఉంది. అలానే 24 క్యారెట్ మేలిమి బంగారం పది గ్రాముల ధర కూడా రూ. 73,190 వద్ద అమ్ముడవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర 78,వేల 750 రూపాయలుగా ఉంది. తులం అంటే విశాఖ , విజయనగరం లాంటి జిల్లాల్లో 11.600 మిల్లీగ్రాములు..కాస్త రేటు ఎక్కువగా ఉంటుంది. బంగారం మరింత పెరిగే అవకాశం కూడా ఉందంటున్నారు.
ఇవాళ ఢిల్లీ మార్కెట్లో వెండి రేటు కిలో మీద రూ. 100 పడిపోయింది. దాంతో నేడు ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 87,900 వద్ద ఉంది. అలానే హైదరాబాద్ లో కూడా వెండి రేటు కిలో మీద రూ. 100 పడిపోయి రూ. 92,900 వద్ద ఉంది. బెంగుళూరు లో దాదాపు రెండు వేలకు పైగా వెండి ధర తక్కుగా ఉంది. పెట్టుబడులు పెట్టేవారికి బెంగుళూరు మంచి ఆప్షన్.