కలికాలం ..లేదంటే స్కూల్ పిల్లకి ప్రేమలేఖలు ఏంటి...నీకేం తెలీదు...ఇప్పుడు పిల్లలు అలానే ఉన్నారంటారా... అవును లే జనరేషన్ గ్యాప్ మరి చేద్దాం. ఇపుడు పిల్లల బుధ్ది కాదు ..పెద్ద వాళ్ల దృష్టి కూడా బాలేదు. గురువు స్థానంలో ఉండి వెర్రి వేషాలు వేస్తున్న వారిని వేలల్లో చూస్తున్నాం. ఇక్కడే కాదు ..అగ్రరాజ్యం ..అమెరికాలో సౌత్ కరోలినా లోను ఇలాంటి సన్నాసులే ఉన్నారు. తన విద్యార్థినికి ప్రేమ లేఖలు రాశాడు ఓ టీచర్ .. కానుకలు ఇస్తూ కౌగిలించుకుంటూ వేధింపులకు పాల్పడ్డాడు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కలికాలం ..లేదంటే స్కూల్ పిల్లకి ప్రేమలేఖలు ఏంటి...నీకేం తెలీదు...ఇప్పుడు పిల్లలు అలానే ఉన్నారంటారా... అవును లే జనరేషన్ గ్యాప్ మరి చేద్దాం. ఇపుడు పిల్లల బుధ్ది కాదు ..పెద్ద వాళ్ల దృష్టి కూడా బాలేదు. గురువు స్థానంలో ఉండి వెర్రి వేషాలు వేస్తున్న వారిని వేలల్లో చూస్తున్నాం. ఇక్కడే కాదు ..అగ్రరాజ్యం ..అమెరికాలో సౌత్ కరోలినా లోను ఇలాంటి సన్నాసులే ఉన్నారు. తన విద్యార్థినికి ప్రేమ లేఖలు రాశాడు ఓ టీచర్ .. కానుకలు ఇస్తూ కౌగిలించుకుంటూ వేధింపులకు పాల్పడ్డాడు.
ఆ చిన్న పాప స్కూల్లో ఉన్నపుడు ఫొటోలు తీసి ...తన పర్సనల్ డెస్క్ లో దాచుకున్నాడు. స్కూలు రాకపోవడంతో బాలిక వెళ్లే చర్చ్ కు వెళ్లడం మొదలుపెట్టాడు. విషయం తెలిసిన ఫ్రెండ్స్ ..ఎవరో పోలీసులకు సమాచారం చేరవేయడంతో డిటెక్టివ్ పోలీసులు రంగంలోకి దిగారు. తెలిసిందేగా ..అమెరికాలో ఆడపిల్లలు అందులోను చిన్నపిల్లలకు అక్కడ సెక్యురిటీ చాలా ఎక్కువ. తోలు తీసి డోలు కడతారు. సదరు టీచర్ పట్టుకొని వీపు వాయగొట్టారు.
సౌత్ కరోలినాలోని స్టార్ ఎలిమెంటరీ స్కూల్ లో డ్యూక్ టీచర్ గా పనిచేస్తున్నాడు. తన స్కూల్ లో చదివే ఓ పదకొండేళ్ల బాలికకు ప్రేమిస్తున్నానంటూ లెటర్లు రాస్తూ వేధించాడు. దాదాపు అరవైకి పైగా లెటర్లు , బహుమతులు ఇస్తూ కౌగిలించుకునేవాడు. అమ్మాయి అమ్మా నాన్నను రెగ్యులర్ గా కలిసేవాడు. స్కూల్ టీచర్ ఇంత సరదాగా ఉండడాన్ని హ్యాపీ గా ఫీలయ్యారు ఆ తల్లితండ్రులు. అయితే పోలీసులు ఆ బాలికకు రాసిన లెటర్లు, తన వద్ద ఫొటోలను చెక్ చేశారు.వేటిలోను అసభ్యకరంగా లేవని...ప్రేమిస్తున్నానని మాత్రమే చెప్పాడని అంటు పోలీసులు తెలిపారు.
డ్యూక్ గతేడాది ఉత్తమ టీచర్ అవార్డు అందుకున్నాడని జడ్జికి తెలిపాడు. పర్సనల్ బాండ్, పూచీకత్తుతో విడుదల చేయాలని కోరాడు. అయితే అమ్మాయి పేరెంట్స్ దీనికి ఒప్పుకోలేదు. జైలు నుంచి విడుదల చేస్తే బాలికను కానీ, ఆమె కుటుంబాన్ని కానీ కలిసేందుకు ప్రయత్నించవద్దని వార్నింగ్ ఇచ్చారు.