ఇప్పటికే నిర్వాసితులకు రావాల్సిన నష్టపరిహారం రాలేదు. దీంతో తమకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు సమస్యలు తీర్చాలని పప్రజలు కోరారు. ఇప్పటికే సంబంధిత అధికారులను సంప్రదించినా ఎవరూ పట్టించుకోలేదని ప్రజలు వాపోయారు.
న్యూస్ లైన్ డెస్క్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండల పరిధిలోని చిట్యాలకు ఆయన వెళ్లారు. అయితే, బాల్నేపల్లి, చిట్యాల గ్రామస్థులు ఆయనను అడ్డుకున్నారు. టెయిల్‌పాండ్ ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే నిర్వాసితులకు రావాల్సిన నష్టపరిహారం రాలేదు. దీంతో తమకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు సమస్యలు తీర్చాలని పప్రజలు కోరారు. ఇప్పటికే సంబంధిత అధికారులను సంప్రదించినా ఎవరూ పట్టించుకోలేదని ప్రజలు వాపోయారు.
ఇప్పటికైనా నష్టపరిహారం చెల్లించడంతో పాటు సమస్యలు తీర్చాలని ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. అయినప్పటికీ ఆయన సానుకూలంగా స్పందించకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లల్లోకి పాములు తేళ్లు వస్తున్నాయని వాపోయారు. కనీసం తాగునీరు కూడా అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వాల్సిన మంత్రి మొహం చాటేశారు. అక్కడ ఉండలేక పోలీస్ సెక్యూరిటీతో తిరిగి వెళ్లిపోయారు.
నల్గొండ జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం
ఉత్తమ్ కాన్వాయ్ అడ్డుకున్న టెయిల్ పాండ్ నిర్వాసితులు pic.twitter.com/FfBgcC4bVL — News Line Telugu (@NewsLineTelugu) August 12, 2024