ముద్దుగా చీరకట్టులో ఆడపిల్ల రూపంలో చూడడం మాత్రం ఎప్పుడు లేదు. వినాయకునికి ఆడపిల్ల రూపంలో చూడడం మాత్రం ఇదే మొదటిసారి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: వినాయకుని పూజ అనగానే..బాధ్రపద మాసం లో చవితి రోజున చేసే పూజలు తెలుసు. వినాయకునికి వేల రూపాల్లో మనం బాగా చూశాం. ప్రతి వినాయక చవితికి మన వాళ్ల క్రియేటివిటీ వినాయకునికి ఓ కొత్త రూపాన్ని సృష్టిస్తూనే ఉంటారు. కాని వినాయకున్ని ముద్దుగా చీరకట్టులో ఆడపిల్ల రూపంలో చూడడం మాత్రం ఎప్పుడు లేదు. వినాయకునికి ఆడపిల్ల రూపంలో చూడడం మాత్రం ఇదే మొదటిసారి.
విఘ్నాలకధి పతి గణపతిని రకరాకాల భంగిమలో పుజిస్తారు.భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో ఉంది. సుచింద్రం శక్తి పీఠాన్ని తనుమలయన్ లేదా స్థనుమలయ దేవాలయం అని కూడా అంటారు. సుచింద్రం శక్తిపీఠం దేవాలయంలో ఆలయ ప్రధాన దేవతలు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఒకే రూపంలో కనిపిస్తారు. ఈ శక్తిపీఠం లో గణపతిని స్త్రీ రూపంలో పూజిస్తారు. అయితే ఈ శక్తిపీఠంలో అమ్మవారు నారాయణి రూపంలో పూజించబడుతుండగా.. గణపతి.. స్త్రీ రూపంలో అంటే విఘ్నేశ్వరి రూపంలో పూజిస్తారు.
అంతే కాదు ..ఏదైనా పనులు జరగకుండా అలానే ఆగిపోతే ..ఈ విఘ్నేశ్వరీ దేవికి పూజలు జరిపిస్తారని నమ్మకం. ఇది గ్రామస్థుల నమ్మకమే కాదు ..చుట్టు వేల కుటుంబాల నమ్మకం . వినాయకచవితి దగ్గర్లో అమ్మవారికి నవరాత్రులు కూడా జరిపిస్తారు.