ఐటీ కంపెనీ అమెజాన్‌లో రూ.2 కోట్ల ప్యాకేజీతో అప్లైడ్ సైంటిస్ట్ ఉద్యోగం సాధించాడు. ఈ రోజే విధుల్లో చేరడంతో తల్లితండ్రులు చాలా సంతోషిస్తున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : వికారాబాద్ కు చెందిన యువకుడు జాక్ పాట్ కొట్టాడు . ఏడాదికి 2 కోట్ల రూపాయిల ప్యాకేజీతో అమేజాన్ లో కొలువు సాధించాడు. 2019లో ఐఐటీ పట్నా నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి పూర్తిచేశాడు,. వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలం తుంకిమెట్ల గ్రామానికి చెందిన అర్బాజ్ ఖురేషీ అమేజాన్ లో ఉద్యోగం సంపాదించాడు . ఐటీ కంపెనీ అమెజాన్‌లో రూ.2 కోట్ల ప్యాకేజీతో అప్లైడ్ సైంటిస్ట్ ఉద్యోగం సాధించాడు. ఈ రోజే విధుల్లో చేరడంతో తల్లితండ్రులు చాలా సంతోషిస్తున్నారు.
2019లో ఐఐటీ పట్నా నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసిన ఆయన మూడో సంవత్సరంలో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ మెషిన్ లెర్నింగ్ కోవిదుడు గేల్ డయాస్ వద్ద 3 నెలలు ఇంటర్న్‌షిప్ చేశారు. ఆ తర్వాత బెంగుళూరులోని మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ లో రెండేళ్లు పనిచేశారు. 2023 లో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ నుంచి ఏఐ , మెషిన్ లెర్నింగ్ లో ఎంఎస్ చేశాడు. యువకుడి తండ్రి యాసిన్ ఖురేషీ ప్రస్తుతం ఎక్సైజ్ జాయింట్ కమిషనర్‌గా పని చేస్తున్నారు. కొడుకు ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించటం ఆనందంగా ఉందని తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు అభినందనలు తెలుపుతున్నారు.