Ambani:అంబానీ ఇంట్లో పెళ్లి.. స్పెషల్ వంటకాలు ఇవే.!

మరికొన్ని గంటల్లో అంబానీ ఇంట పెళ్లి వేడుకలు జరగనున్నాయి. ముకేశ్ అంబానీ రెండవ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి కోసం ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ వివాహ వేడుకకు ప్రపంచ దేశాల్లోని బిజినెస్ మాన్ లతో పాటు రాజకీయ నాయకులు, సినీ తారలు  స్పోర్ట్స్ లో ఆరితేరిన ఆటగాళ్లు  ఎంతోమంది ప్రముఖుల హాజరవ్వనున్నారు. అలాంటి ఈ పెళ్లిలో  అతిధులకు ఎలాంటి ప్రాబ్లం రాకూడదని అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారట.  ఫుడ్ విషయానికి వస్తే వంటకాలు చాలా స్పెషల్ అని తెలుస్తోంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.


Published Jul 10, 2024 08:54:53 AM
postImages/2024-07-10//1720581893_Anantambaniradhikamerchantweddingmumbai17205151980511720515198352.avif

న్యూస్ లైన్ డెస్క్: మరికొన్ని గంటల్లో అంబానీ ఇంట పెళ్లి వేడుకలు జరగనున్నాయి. ముకేశ్ అంబానీ రెండవ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి కోసం ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ వివాహ వేడుకకు ప్రపంచ దేశాల్లోని బిజినెస్ మాన్ లతో పాటు రాజకీయ నాయకులు, సినీ తారలు  స్పోర్ట్స్ లో ఆరితేరిన ఆటగాళ్లు  ఎంతోమంది ప్రముఖుల హాజరవ్వనున్నారు. అలాంటి ఈ పెళ్లిలో  అతిధులకు ఎలాంటి ప్రాబ్లం రాకూడదని అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారట.  ఫుడ్ విషయానికి వస్తే వంటకాలు చాలా స్పెషల్ అని తెలుస్తోంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

ఇప్పటికే ఆకాశమంత పందిరి, భూదేవంత పీట అన్నట్టు అంగరంగ వైభవంగా  అనంత అంబానీ రాధిక మర్చంట్ ఫ్రీ వెడ్డింగ్ వేడుక జరుగుతుంది. వధూవరులు ఇద్దరు ఇప్పటికే స్పెషల్ అపీరియన్స్ డ్రస్సుల్లో అందరినీ ఆకట్టుకుంటున్నారు. వీరు వేసుకునే డ్రెస్ నుంచి మొదలు ప్రతి ఒక్కటి  చరిత్రలో నిలిచిపోయేలా  వాడబోతున్నారు. అలాంటి ఈ వెడ్డింగ్ లో  వంటకాల విషయంలో కూడా చాలా స్పెషల్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రపంచ దేశాలలోని ఫేమస్ అయినటువంటి వంట మనుషులను తెప్పించి మొత్తం 2500 రకాల వంట రెడీ చేస్తారట.

దాదాపు 25 నుంచి 35 మంది చెప్ ల ఆధ్వర్యంలో ఒక్కో టీం నుంచి ఒక్కోరకంగా విందు భోజనాలు అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా ఆసియన్ తాయి, పార్సి, మేక్సీకన్, జపానీస్ వంటకాలు. ఇందులో ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ కోసం 80 రకాలు లంచ్ కోసం 250 రకాలు, రాత్రి భోజనం కోసం 250 రకాల వంటకాలు అందించబోతున్నారట. మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకకు  వచ్చిన అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తారట. ముఖ్యంగా ఇందులో స్పెషల్ వంటకాలుగా పేరు పొందినటువంటి  కాశీ చాట్ బండార్, టిక్కీ, టమాటా చాట్, బనారస్ చాటు, కుల్ఫీ, పాలక్ చాట్, చానా కచోరి దహీ పూరి, ఫలుదా వంటి ఐటమ్స్ చాలా స్పెషల్ గా ఉంటాయట.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu marriage ananth-ambani radhika-marchant special-foods

Related Articles