నా అన్వేషణతో ఉన్న ఆ అమ్మాయి ఎవరు ? ఆమెతో అవినాష్ కు సంబంధమేంటీ ?

నా అన్వేషణ అనే పేరు చెప్పగానే చాలామంది గుర్తుకు వచ్చేది ప్రపంచ యాత్రికుడు అవినాష్. కనీసం 30 సంవత్సరాలు వయసు కూడా దాటని ఈయన ప్రపంచంలోని చాలా ప్లేస్ లను చుట్టి వచ్చి ఎంతోమంది  అభిమానులను సంపాదించుకున్నాడు.


Published Jul 23, 2024 07:48:18 AM
postImages/2024-07-23/1721735139_avi.jpg

న్యూస్ లైన్ డెస్క్: నా అన్వేషణ అనే పేరు చెప్పగానే చాలామంది గుర్తుకు వచ్చేది ప్రపంచ యాత్రికుడు అవినాష్. కనీసం 30 సంవత్సరాలు వయసు కూడా దాటని ఈయన ప్రపంచంలోని చాలా ప్లేస్ లను చుట్టి వచ్చి ఎంతోమంది  అభిమానులను సంపాదించుకున్నాడు.  నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ ద్వారా కోట్లాదిమంది అభిమానులను పొందాడు. ప్రపంచ దేశాలలోని ఎన్నో విషయాలను మనకు తేల్చి చెప్పుతూ ఓ అన్వేషకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.  ప్రపంచంలోనే ఏడు వింతలను చుట్టి వచ్చిన ఏకైక భారతీయుడిగా  ప్రత్యేకత చాటుకున్నాడు. ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్ని అవమానాలు ఎదురైనా అనుకున్న లక్ష్యం దిశగా అడుగులు వేస్తూ తన విలక్షణమైనటువంటి ప్రతిభను చాటుకుంటున్న తెలుగు టాప్ యూట్యూబర్ లో ఒకరిగా పేరుపొందాడు.

నా కళ్ళతో మీకు ఈ ప్రపంచం మొత్తం చూపిస్తానని యాత్రలు చేస్తూ, ఎంతగానో అబ్బురపరిచే అన్వేషకుడు   అవినాష్. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం  భీమిలి సమీపంలో  పేద కుటుంబంలో జన్మించిన ఈయన కంప్యూటర్  సైన్స్ లో డిగ్రీ పూర్తి చేసి  ఆ తర్వాత ఎంబీఏ పూర్తి చేశాడు. హోటల్ మేనేజ్మెంట్ కూడా పూర్తి చేసి ఇండియా, ఇటలీ,  అమెరికా, ఆస్ట్రేలియా,, చైనా  ఇతర దేశాలలో వర్క్ చేశాడు. ఆ అనుభవంతోనే ప్రపంచ యాత్రికుడిగా ప్రయాణం మొదలుపెట్టి ప్రపంచంలోని ఎన్నో యాత్రలు చేసి మనందరికీ చూపిస్తున్నాడు. ముఖ్యంగా ఎన్నో దేశాలు చుడుతూ వాటి విశిష్టతను , కట్టుబాట్లు ఆచారాలను చూపిస్తూ ఆ ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తున్న అవినాష్  తాజాగా ఆర్కిటిక్  మహాసముద్రంపై ప్రయాణం చేసి అద్భుతమైనటువంటి వీడియో మనకు అందించాడు.

 అంతేకాకుండా ఆయనతోపాటు మరో అమ్మాయి కూడా వచ్చింది మరి అవినాష్ కు  ఆ అమ్మాయి ఏమవుతుంది. వీరిద్దరూ కలిసి ఈ ట్రిప్ ఎక్కడ దాకా సాగింది అనేది చూద్దాం. ఇప్పటివరకు దక్షిణ ధ్రువంలో పడవ ప్రయాణం చేసి మనకు అంతా చూపించిన అవినాష్ ఇప్పుడు ఉత్తర ధ్రువంలో పడవ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఆర్కిటిక్ మహాసముద్రంలో ఒక విదేశీ అమ్మాయితో ప్రయాణాన్ని మొదలుపెట్టాడు.

https://youtu.be/wdbhudGWnik?si=q5BzyYmqqU8pD1ef

ఇప్పటికే ఆరు రోజులు పూర్తి చేసిన ప్రయాణం వీడియోను  తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశాడు. దీంతో చాలామంది ఆయనతో ఉన్న అమ్మాయి ఎవరు అని అన్వేషించడం మొదలుపెట్టారు. అయితే ఆ అమ్మాయి పేరు ఫ్యాట్రీకా. చైనాకు చెందినటువంటి ఈ అమ్మాయి తో విదేశీ ట్రిప్పుల సమయంలోనే పరిచయమైంది. ఆమె కూడా ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. ఈమె యూరప్ లోని ఫ్రాన్స్ లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్  లో అవినాష్ కు పరిచయమైనట్టు తెలుస్తోంది.

దీంతో ఆయన ఆమెతో ఆర్కిటిక్ మహాసముద్ర యాత్ర మొదలుపెట్టారు. ఈమె అద్భుతమైన ఫోటోగ్రాఫర్,  అంతేకాకుండా ఈమెకు ఈ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ ఫోటోగ్రఫీ అవార్డు కూడా వచ్చిందట.  కాబట్టి తన యాత్రలో ఎంతో ఉపయోగపడుతుందని భావించి  మొత్తం 20 లక్షల టికెట్ తీసుకుని  ఆర్కిటిక్ క్రూయిజ్ షిప్ జర్నీ  మొదలుపెట్టారు. వీరి జర్నీలో వీరిద్దరి ప్రయాణం గురించి దాదాపు 30 నిమిషాల వీడియో ఎంతోమందిని ఆకట్టుకుని అద్భుతమైనటువంటి ఆదరణ పొందుతోంది.

newsline-whatsapp-channel
Tags : ap avinash arctic-ocean patrica sheep

Related Articles