Maha Kumbh : ప్రపంచంలో అతిపెద్ద ట్రాఫిక్ జామ్...కుంభమేళా లో 300 కి.మీ ట్రాఫిక్ జామ్ !

ఆదివారం సాయంత్రం 6 గంటల నాటికి 1.42 కోట్లకు పైగా భక్తులు గంగా, సంగమంలో స్నానమాచరించారు. ఇప్పటి వరకు దాదాపు 42 కోట్లకు పైగా భక్తులు కుంభమేళాకు చేరుకున్నారు.


Published Feb 10, 2025 12:51:00 PM
postImages/2025-02-10/1739172163_images.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మహా కుంభమేళా ప్రయాగ్ రాజ్ లో 300 కి.మీ ట్రాఫిక్ జామ్ జరిగింది. దాదాపు వాహనాలు 11 గంటలకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. గూగుల్ నావిగేషన్ ను నమ్మవద్దు అంటూ నెటిజన్లు కమెంట్లు చేస్తున్నారు.కుంభామేళా మొదలై 28 రోజులు అవుతున్నా ఇప్పటికీ రద్దీ తగ్గడం లేదు. ఆదివారం సాయంత్రం 6 గంటల నాటికి 1.42 కోట్లకు పైగా భక్తులు గంగా, సంగమంలో స్నానమాచరించారు. ఇప్పటి వరకు దాదాపు 42 కోట్లకు పైగా భక్తులు కుంభమేళాకు చేరుకున్నారు.


ప్రయాగ్‌రాజ్ వైపు సుమారు 200 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ప్రయాగ్ రాజ్ కు వెళ్లే మార్గాల్లో భారీ రద్దీ కారణంగా , అనేకమంది భక్తులు గంటలు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని చాలా జిల్లాలో ట్రాఫిక్ నిలిచిపోయింది. కట్ని, మైహార్, రేవా అంతటా రోడ్లు మూసుకుపోయాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాఫిక్ జామ్ జరిగినట్లు మీడియా సంస్థలు వివరిస్తున్నాయి.


“ఈ రోజు ప్రయాగ్‌రాజ్ వైపు వెళ్లడం అసాధ్యం. ఎందుకంటే 200-300 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ ఉంది” అని పోలీసులు తెలిపారు. రేవా జిల్లాలోని చక్‌ఘాట్ వద్ద కట్ని నుంచి ఎంపీ-యూపీ సరిహద్దుల వరకు 250 కి.మీల విస్తీర్ణంలో భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌లో జనం భారీగా తరలిరావడంతో నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. రద్దీని కంట్రోల్ చెయ్యలేక ఈ పని చేసినట్లు అధికారులు తెలిపారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu prayagraj mahakumbamela

Related Articles