త్వరలో ఈ భూమ్మీద మగజాతి అంతం కానుందా? రానున్న రోజుల్లో మగపిల్లలు పుట్టరా? అందుకు అవసరమైన క్రోమోజోమ్ లు రోజురోజుకు తగ్గిపోతున్నాయా? భవిష్యత్తులో స్త్రీ పురుష నిష్పత్తిలో స్త్రీల నిష్పత్తి పెరగబోతోందా?
న్యూస్ లైన్ డెస్క్ : త్వరలో ఈ భూమ్మీద మగజాతి అంతం కానుందా? రానున్న రోజుల్లో మగపిల్లలు పుట్టరా? అందుకు అవసరమైన క్రోమోజోమ్ లు రోజురోజుకు తగ్గిపోతున్నాయా? భవిష్యత్తులో స్త్రీ పురుష నిష్పత్తిలో స్త్రీల నిష్పత్తి పెరగబోతోందా? ఈ ప్రశ్నలకు తాజా అధ్యయనాలు అవుననే సమాధానం చెప్తున్నాయి. స్త్రీ కడుపులో పెరుగుతున్న పిండం ఆడనా? మగనా? చెప్పాలంటే క్రోమోజోమ్ ఆధారంగానే చెప్తారు. అయితే.. తాజాగా శాస్త్రవేత్తలు చేసిన ఓ అధ్యయనంలో మనుషుల్లో వై క్రోమోజోమ్ తగ్గుతోందని.. దీని వల్ల రానున్న రోజుల్లో మగబిడ్డలు పుట్టే అవకాశాలు మరింత తగ్గుతాయని తేలింది. వివరాల్లోకి వెళ్తే..
స్త్రీ కడుపులో పెరిగే పిండాన్ని క్రోమోజోముల ద్వారా విభజిస్తారన్న విషయం తెలిసిందే. రెండు ఎక్స్ క్రోమోజోములు ఆడవారికి.. మగవారికి ఒక ఎక్స్, మరో వై క్రోమోజోమ్ ఉంటుంది. ఆడవారిలోని ఎక్స్ క్రోమోజోమ్ తో మగవారిలోని ఎక్ష్ క్రోమోజోమ్ కలిస్తే అప్పుడు పిండం ఫీమేల్ అవుతుంది. మగవారిలోని వై క్రోమోజోమ్ ఆడవారిలోని ఎక్స్ క్రోమోజోమ్ తో కలిసినప్పుడు పిండం మేల్ అవుతుంది. దీని ప్రకారం మగ సంతానం పుట్టాలంటే వై క్రోమోజోమ్ ఉండాల్సిందే. అయితే.. ప్రస్తుత రోజుల్లోని లైఫ్ స్టైల్ వల్ల వై క్రోమోజోమ్ క్రమంగా నశిస్తోంది. దీంతో మగబిడ్డలు పుట్టే అవకాశాలు తగ్గిపోతున్నాయని ప్రోసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనే జర్నల్ చేసిన పరిశోధనలో తేలింది. ఈ సైన్స్ అలర్ట్ నివేదిక ప్రకారం మరికొన్ని సంవత్సరాల్లో వై క్రోమోజోమ్ పూర్తిగా అంతం అవుతుంది. దీంతో క్రమంగా మగజాతి.. ఆ తర్వాత మానవజాతి భూమ్మీద పూర్తిగా అంతం కావొచ్చనేది సారాంశం.
ఈ అధ్యయనంలో స్త్రీలలో ఎక్స్ క్రోమోజోములు 900 జన్యువులను కలిగి ఉంటే.. పురుషులు కేవలం 55 మాత్రమే వై క్రోమోజోములు కలిగి ఉంటున్నారు. ఈ అసమానత వల్ల రానున్న రోజుల్లో మానవ మనుగడ ప్రశ్నార్థకమవుతుందంటున్నారు శాస్త్రవేత్తలు. తాజా స్టడీ ప్రకారం రానున్న 11 మిలియన్ సంవత్సరాల్లో మిగిలిన 55 వై క్రోమోజోములు కూడా నాశనమై పురుష నిష్పత్తి పూర్తిగా తగ్గిపోతుంది. తద్వారా పుట్టుక ఆగిపోయి మానవ జాతి నశించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.