Adam Britton: 60కిపైగా కుక్కలను రేప్ చేసి చంపేసిన జువాలజిస్ట్..!

ఆస్ట్రేలియాలోని డార్విన్ లో నివసించే బ్రిటన్ కు చెందిన మొసళ్ల నిపుణుడు ..జూవాలజిస్ట్.. ఆడమ్ బ్రిట్టన్ పై నమోదైన కేసుకు సంబంధించిన తుది విచారణ గురువారం వాయిదా పడింది. బ్రిట్టన్ పై 60 కి పైగా కంప్లెయింట్స్ ఉన్నాయి. వాటన్నింటిని ఒప్పుకున్నాడు కూడా.


Published Jul 15, 2024 10:51:00 AM
postImages/2024-07-15/1721021008_Untitleddesign45.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: వినడానికే...చాలా అసహ్యంగా అనిపించే..విషయం...రాయడానికి ...చదవడానికే ఇబ్బంది కలిగించే వార్త ఇది. మనిషిని మనిషి మోసం చేసుకోవడం ..బాధపెట్టడం..రేప్ ..మర్డర్ కామన్ అయిపోయాయి. కాని మూగజీవులను కూడా రేప్ చేసే మహానుభావులుండే ప్రపంచంలో బతుకుతున్నాం. 


ఆస్ట్రేలియాలోని డార్విన్ లో నివసించే బ్రిటన్ కు చెందిన మొసళ్ల నిపుణుడు ..జూవాలజిస్ట్.. ఆడమ్ బ్రిట్టన్ పై నమోదైన కేసుకు సంబంధించిన తుది విచారణ గురువారం వాయిదా పడింది. బ్రిట్టన్ పై 60 కి పైగా కంప్లెయింట్స్ ఉన్నాయి. వాటన్నింటిని ఒప్పుకున్నాడు కూడా. బ్రిట్టన్ డజన్లకొద్దీ కుక్కలపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా వాటిని టార్చర్ చేసి చంపేశాడట. ఎన్ టీ సుప్రీం కోర్డు జడ్జి మైఖేల్ గ్రాంట్ తన సిబ్బందిని, జంతు ప్రేమికులను కోర్టు బయటకు వెళ్లాల్సిందిగా సూచించారట. అంత దారుణమైన హింసను వినడానికి కష్టంగా ఉంటుందని తెలిపారట.
ఇది జంతువులపట్ల జరిగిన అత్యంత హేయమైన హింస’ జడ్జి పేర్కొన్నారు. ప్రజలు తుది తీర్పు కోసం ఎదురుచూస్తుండగా ..నిందితుడి తరుపు న్యాయవాది కొత్త నివేదకను జడ్జికి సమర్పించాడు. జైల్లో సుమారు 30 గంటలపాటు సైకలజిస్ట్ ద్వారా చికిత్స పొందిన అనంతరం అతని ప్రస్తుత మానసిక పరిస్థితి గురించి ఆ నివేదిక వివరించింది.


బ్రిట్టన్  చిన్నప్పటి నుంచే మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని చెప్పాడు. అది అతని తప్పు కాదని.. వాదించాడు. అంతేకాదు తను పశ్చాత్తాపపడుతున్నాడని..తెలిపారు. దయచేసి శిక్ష తగ్గించాలని కోరాడు. నిజానికి వాదిస్తున్నా..తనకి కూడా ఈ కేసులో తప్పు ఉందని తెలిసినా ఏం చెయ్యలేకపోతున్నానని అన్నారు.


ఏబీసీ వార్తాసంస్థ కథనం ప్రకారం.. బ్రిట్టన్ కుక్కలను హింసించి చంపేవాడు. ఆ తతంగాన్ని రికార్డు చేసేవాడు. కుక్కలను హింసించేందుకు ఒక షిప్పింగ్ కంటెయినర్ ను టార్చర్ గదిగా మార్చుకున్నాడు. అందులోనే కుక్కలను లైంగికంగా హింసించేవాడు. ఇంతటి కఠినమైన చర్యకు పాల్పడిన ఈ వ్యక్తికి కోర్టు ..249 యేళ్లు జైలు శిక్ష వేశారు జడ్జి.

newsline-whatsapp-channel
Tags : dogs viral-news kill

Related Articles