ప్రస్తుత కాలంలో దేశంలో విపరీతమైనటువంటి నిరుద్యోగం పెరుగుతోంది. ఉద్యోగాల కోసం ఎంతోమంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఇందులో కొంతమంది బ్యాంకు ఉద్యోగాల కోసం స్పెషల్ గా ట్రై
న్యూస్ లైన్ డెస్క్:ప్రస్తుత కాలంలో దేశంలో విపరీతమైనటువంటి నిరుద్యోగం పెరుగుతోంది. ఉద్యోగాల కోసం ఎంతోమంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఇందులో కొంతమంది బ్యాంకు ఉద్యోగాల కోసం స్పెషల్ గా ట్రై చేస్తూ ఉంటారు. మరి అలాంటి వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. పంజాబ్ అండ్ సింధు బ్యాంకులో ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. ఢిల్లీలోని పంజాబ్ మరియు సింధు బ్యాంకులో ఇండియా మొత్తంలో స్పెషలిస్టు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య:213
మొత్తం ఖాళీలు:
ఇందులో సీనియర్ మేనేజర్ పోస్టులు 33, మేనేజర్ 117 పోస్టులు, ఆఫీసర్ 56 పోస్టులు, చీఫ్ మేనేజర్ 7 పోస్టులు భర్తీ చేయనున్నారు.
అర్హత ప్రమాణాలు:
ఉద్యోగాన్ని బట్టి ఎంసీఏ, బీటెక్, బిఈ, డిగ్రీ, పీజీ, సిఎఫ్ఏ, సీఐఐఐబి, పిజిడిబిఏ, ఐసిడబ్ల్యూఏ, ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
శాలరీ వివరాలు:
మీకు వచ్చే ఉద్యోగాన్ని బట్టి 48,480 నుంచి మొదలు 1,20,940 శాలరీ ఉంటుంది.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్,ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ప్రక్రియ:
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది
చివరి తేదీ: సెప్టెంబర్ 15, 2024 వరకు చివరి తేదీ.