NEET Exam 2025: ఏపీలో నీట్ రాసిన 72 యేళ్ల బామ్మ..తల్లికూతుర్లు !

ఉన్నత చదువులపై ఈ పెద్దావిడకున్న ఆసక్తి పరీక్ష కేంద్రంపై వద్ద ఉన్న వారందరినీ ఆశ్చర్యపరిచింది.


Published May 05, 2025 12:14:00 PM
postImages/2025-05-05/1746427498_motherdaughter0505newsroom1746423308788.png

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : చదువుకోవాలనుకునే ఆసక్తి ఉండాలే కాని చదువుకోవడానికి వయసుతో సంబంధం ఏంటి చెప్పండి. నగరానికి చెందిన పోతుల వెంకటలక్ష్మి అనే మహిళ 72 యేళ్ల వయసులో  ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో పరీక్ష రాశారు. అయితే ఈ బామ్మ పరీక్ష రాయడానికి రావడంతో బామ్మను ఆసక్తిగా చూశారు. ఉన్నత చదువులపై ఈ పెద్దావిడకున్న ఆసక్తి పరీక్ష కేంద్రంపై వద్ద ఉన్న వారందరినీ ఆశ్చర్యపరిచింది.


తెలంగాణలో మరో విశేషం చోటు చేసుకుంది. తన కూతురుతో పాటు ఓ మహిళ ఆదివారం జరిగిన నీట్ పరీక్ష రాశారు. అయితే తల్లీకూతుర్లు ఇద్దరు వేర్వేరు జిల్లాలో పరీక్ష రాశారు. సూర్యాపేట జిల్లాలోని మంచ్యానాయక్ తండాకు చెందిన భూక్యా సరిత ప్రస్తుతం ఆర్ ఎంపీగా పనిచేస్తున్నారు. పెళ్లి కారణంగా బీఎస్సీ నర్పింగ్ చివరి సంవత్సరంలో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. అయితే ఇప్పుడు పెద్ద కూతురు కావేరిని డాక్టర్ చేయాలనే ఉద్దేశ్యంతో నీట్ పరీక్షకు ట్రై చేసి పరీక్ష రాయించారు. . ఆదివారం తన కూతురుతో పాటు పరీక్ష రాశారు.
 

newsline-whatsapp-channel
Tags : andhrapradesh newslinetelugu neet telangana

Related Articles