ఉదయం 6 గంటలకే బ్రేక్ దర్శనాలు ప్రారంభించి పది గంటకల్లా పూర్తి చెయ్యాలని నిర్ణయించింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బ్రేక్ దర్శనాలు లేఖపై టీటీడీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అసలే సమ్మర్ హాలిడేస్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. శ్రీవారి దర్శనానికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే మే 1 నుండి జూలై 15 వరకు బ్రేక్ దర్శనాలను పరిమితం చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇక సాధారణ ప్రజలు బ్రేక్ దర్శనం లెటర్స్ ను టీటీడీ అనుమతించదు.
వీఐపీ బ్రేక్ దర్శనాలను స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకే పరిమితం చేసిన టీటీడీ. ఉదయం 6 గంటలకే బ్రేక్ దర్శనాలు ప్రారంభించి పది గంటకల్లా పూర్తి చెయ్యాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ దర్శనాలు ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగుతుంది. ఈ నిర్ణయం మే 1 నుంచి జూలై 15 వరకు ప్రజాప్రతినిధులు, టీటీడీ బోర్డు సభ్యుల బ్రేక్ దర్శనాల సిఫారసు లేఖలను అనుమతించరు.