ఈ క్రమంలోనే తాజాగా తిరుమలలో జరిగే శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు 2025కి సంబంధించి కీలక ప్రకటన చేసింది టీటీడీ.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : శ్రీనివాస పద్మావతి పరిణయోత్సవం అంటే స్వామివారికి కళ్యాణోత్సవం . నిత్యం వేలాది మంది దర్శించుకుంటున్నా ...ప్రత్యేక రోజుల్లో స్వామివారి దర్శనాలు మరింత పెరుగుతాయి, ఇలాంటి టైంలో తిరుమలకు వచ్చే భక్తులకు ఏ ఇబ్బందులు రాకుండా ప్రతి ఉత్సవానికి ముందే భక్తులకు తెలియజేస్తారు. దీని వల్ల చిన్నపిల్లలు , వృధ్ధులతో వచ్చే వారు ఇబ్బందిపడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.ఈ క్రమంలోనే తాజాగా తిరుమలలో జరిగే శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు 2025కి సంబంధించి కీలక ప్రకటన చేసింది టీటీడీ.
శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు మే 6 నుంచి 8 వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ వేడుకలను నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో అంగరంగ వైభవంగా జరపనున్నారు. ఈ ఏడాది మే 6 నుంచి 8వ తేదీ వరకు జరిగే శ్రీనివాస పద్మావతి పరిణయోత్సవాలు జరుగుతాయి, మొదటి రోజు గజవాహనం పై శ్రీనివాసుడు వేంచేపు చేస్తారు. రెండో రోజు అశ్వవాహనం మూడో రోజు గరుడవాహనంపై స్వామివారు వేంచేస్తారు. మరో వైపు ఉభయ నాంచారులు పరిణయోత్సవ మండపానికి ప్రత్యేక పల్లకీలలో వేంచాపు చేస్తారు. స్వామి వారి పెళ్లి వైశాఖ శుధ్ధ దశమి శుక్రవారం పూర్వ ఫల్గుని నక్షత్రంలో నారాయణవనంలో ఆకాశరాజు జరిపించినట్లు శ్రీ వెంకటాచల మమాత్యం గ్రంధం తెలిచజేస్తుంది. 1992 నుంచి ఈ కళ్యాణోత్సవాన్ని ఆనాటి నారాయణవనానికి గుర్తుగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు జరగడం విశేషం.