Srivari Seva Quota : జూన్ నెల ఆన్ లైన్ కోటాను రేపు రిలీజ్ చేయనున్న టీటీడీ !

శ్రీవారి సేవ జనరల్ కోటాను ఉదయం 11 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, గ్రూప్ లీడర్ సేవ మధ్యాహ్నం 2 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది.


Published Apr 29, 2025 11:55:00 AM
postImages/2025-04-29/1745908030_SrivariSevaOnlineQuota1024x576.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : జూన్ లో తిరుపతి ప్లాన్ చేస్తున్నారా, అయితే ఆన్ లైన్ కోటాను ఏప్రిల్ 30 న విడుదల చేయనుంది. శ్రీవారి సేవ నాణ్యతను మెరుగుపరచి భక్తులకుమెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ కొత్త సేవను అమల్లోకి తీసుకొస్తుంది. దీనికోసం శ్రీ సత్యసాయి సేవా సంస్థ , ఇషా ఫౌండేషన్ , ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి ఆధ్యాత్మిక సంస్థలను టీటీడీ అధికారులు సందర్శించి అధ్యయనం చేశారు. శ్రీవారి సేవలో కొన్ని ముఖ్యమైన మార్పులను తీసుకువచ్చింది. ఈ కొత్త మార్పులను ఏప్రిల్ 30 నుంచి అమల్లోకి రానున్నాయి.


  శ్రీవారి సేవ జనరల్ కోటాను ఉదయం 11 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, గ్రూప్ లీడర్ సేవ మధ్యాహ్నం 2 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది.గ్రూప్ లీడర్లు ఈ సేవకు 45 ఏళ్ల నుంచి 70 ఏళ్లలోపు ఉండాలి. అప్పుడు తమ పేరును రిజిస్టర్ చేసుకోవచ్చు. 15 రోజులు, నెల లేదా 3 నెలల వ్యవధిలో సేవ చేసేందుకు ఆన్‌లైన్ ఆప్షన్ ఎంచుకోవాలి.


శ్రీవారి సేవకులుగా పనిని పర్యవేక్షించడం , సేవకు వచ్చిన సేవకుల వివరాలు తీసుకోవడం ప్రతి సేవకుని పనితీరును మూట్యాంకనం చేయడం బాధ్యతలు ఉంటాయి. కనీసం 10వ తరగతి విద్యార్హత కలిగిన పురుషులకు పరకామణి సేవకు అవకాశం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది.ఆన్‌లైన్ పరకామణి సేవను బుక్ చేసుకోవచ్చు.

newsline-whatsapp-channel
Tags : venkateswara ttd tirumala-srivaru

Related Articles