ANDHRAPRADESH: రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలక్టర్ మృతి !

ఈ యాక్సిడెంట్ జరిగింది. క్షతగాత్రులను కలెక్టర్ శ్రీధర్ పరామర్శించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.  


Published Apr 07, 2025 02:46:41 AM
postImages/2025-04-07/1744011987_cr20250407tn67f37b29975f5.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఏపీ లోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంబేపల్లి మండలం యర్రగుంట్ల వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో  హెచ్ ఎన్ ఎస్ పీలేరు యూనిట్ -2 స్పెషల్ డిప్యూటీ కలక్టర్ రమ అక్కడిక్కడే చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన స్పెషల్ డిప్యూటీ కలక్టర్ రమ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. రాయచోటి కలక్టరేట్ లో గ్రీవెన్స్ కు వెళ్లి వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. క్షతగాత్రులను కలెక్టర్ శ్రీధర్ పరామర్శించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.  

newsline-whatsapp-channel
Tags : newslinetelugu collectors annamayya auto-accident

Related Articles