అంతరిక్ష రంగంలో సునీత ప్రదర్శించిన ధైర్య సాహసాలు ఆమె పరిశోధనలు ఈ ప్రపంచానికి ఎంతో ఆదర్శవంతమైనవని తెలిపారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: తొమ్మిది నెలల తర్వాత సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతరిక్షం నుంచి భూమ్మీదకు చేరుకున్న భారత్ సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ లకు ఏపీ అసెంబ్లీ అభినందనలు తెలిపింది. ఇద్దరు వ్యోమగాములు భూమిని చేరుకోవడం సురక్షితంగా చేరుకోవడం ఆనందాయకమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. వ్యోమగాముల జీవితం మానవాళికి స్పూర్తిదాయకమని ప్రశంసించారు. అంతరిక్ష రంగంలో సునీత ప్రదర్శించిన ధైర్య సాహసాలు ఆమె పరిశోధనలు ఈ ప్రపంచానికి ఎంతో ఆదర్శవంతమైనవని తెలిపారు.