ap: భధ్రాచలంలో కుప్పకూలిన ఆరంతస్తుల భవనం ..శిథిలాల కింద ఆరుగురు !

నిర్మాణంలో లోపాల వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. కూలిన భవనం పక్కనే ఆలయం కూడా నిర్మిస్తున్నారు.


Published Mar 26, 2025 04:56:00 PM
postImages/2025-03-26/1742988413_badrachalam6storuedf.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : భద్రాచలంలో బుధవారం ఆరంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ భవనం శిథిలాల కింద ఆరుగురు ఉన్నారని అధికారులు అంచనా. అయితే వెంటనే ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి భవన శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు స్థానికులు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 


అయితే పాత భవనంపైనే నాలుగు అంతస్తులు నిర్మిస్తున్నారు. నిర్మాణంలో లోపాల వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. కూలిన భవనం పక్కనే ఆలయం కూడా నిర్మిస్తున్నారు. రెండేళ్లుగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. అనుమతులు లేకుండా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. భధ్రాచలం ఆలయ అధికారులు , పంచాయితీ అధికారులు ఈ నిర్మాణాన్ని నిలిపివేయాలని నోటీసులు జారీ చేశారు. 


అయితే కొన్ని రోజులు నిర్మాణాన్ని ఆపేసి ...మళ్లీ ఇఫ్పుడు తిరిగి కట్టడం మొదలుపెట్టారు. గతంలో ఈ నిర్మాణ పనుల్లో పదుల సంఖ్యలో కార్మికులు పనిచేసేవారు. అయితే నాలుగైదు రోజులుగా ఈ భవనం వద్ద ఒకరిద్దరూ మాత్రమే పనిచేస్తున్నారు. అయితే బిల్డింగ్ పరిమితికి మించి కట్టడం వల్ల కూలిపోయిందంటున్నారు అధికారులు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu

Related Articles