దరఖాస్తులకు సంబంధించిన డౌట్స్ ఎంక్వైరీ లకు 70751-59996, 70750-39990 నెంబర్లలో సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చన్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ గవర్నమెంట్ కీలక ప్రకటన చేసింది. 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి 6,11 తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. ఈ రోజు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్ఉధలకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తామని తెలిపారు. దరఖాస్తులకు సంబంధించిన డౌట్స్ ఎంక్వైరీ లకు 70751-59996, 70750-39990 నెంబర్లలో సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చన్నారు.
ఏపీలో 352 కేజీబీవీలు ఉండగా .వాటిలో ప్రస్తుతం ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ రీసెంట్ గా రిలీజ్ అవుతుంది. కేజీబీవీ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 11 చివరి తేదీ అని ఎస్పీడీ తెలిపారు. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, నిరుపేద (బీపీఎల్ పరిధిలోని) బాలికలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.