తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను ఈ నెల మార్చి 23 న స్వీకరించి 24 న దర్శనానికి అనుమతించనున్నట్లుగా టీటీడీ తెలిపింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 25,30 తేదీల్లో బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లుగా తిరుమల , తిరుపతి దేవస్థానం శనివారం ఓ ప్రకటన చేసింది.25 తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ,30 న ఉగాది కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. దీంతో 24,29 వ తేదీల్లో ఎలాంటి సిఫారసులేఖలు స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను ఈ నెల మార్చి 23 న స్వీకరించి 24 న దర్శనానికి అనుమతించనున్నట్లుగా టీటీడీ తెలిపింది.
వీకెండ్ నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శనివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద ఘాట్ రోడ్డులో పెద్ద సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులతో అలిపిరి మొదటి మెట్టు వద్ద రద్దీ నెలకొంది. అయితే 25,30 లో దర్శనాలు ప్లాన్ చేసుకున్నవారు ఈ తేదీలు చూసుకొని వెళ్లాలని తెలిపారు టీటీడీ అధికారులు.