ap cm : భార్యకు చంద్రబాబు ఎమోషనల్ భర్త్ డే విషెస్ 2024-06-20 21:59:06

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు( chandrababu naidu)  , భువనేశ్వరి దంపతులది చాలా అన్యోన్యమైన దాంపత్యం . రాజకీయాలు(politics) పక్కనపెడితే జంట చూడముచ్చటగా ఒకరిపై ఒకరికి ప్రేమ, నమ్మకంతో ఇన్నాళ్ల బంధాన్ని నడుపిస్తున్నారు. తన భార్యను నిండు అసెంబ్లీలో అవమానించడాన్ని తట్టుకోలేక చంద్రబాబు ఎమోషనల్ అవడం...  మీడియా ముందు వెక్కివెక్కి ఏడవడమే భువనేశ్వరిపై ఆయనకు ఎంత ప్రేముందో తెలియజేస్తుంది. 


తన భర్తకు విజయం రావాలని ...భువనేశ్వరి( bhuvaneswari)  రోడ్డుపైకి వచ్చి పోరాటం చేశారు. తన భర్త మీద ప్రేమను చాటింది. గత ఐదేళ్ల గడ్డుకాలం ముగిసి చంద్రబాబు-భువనేశ్వరి దంపతుల జీవితంలోకి మళ్లీ మంచిరోజులు వచ్చాయి.  టిడిపి కూటమి అధికారంలోకి రావడం... చంద్రబాబు ముఖ్యమంత్రి ( cm)కావడంలో భువనేశ్వరి  ఆనందానికి అవధులు లేవు. అందుకే ఈ ఏడాది తన పుట్టిన రోజుకు భలే విష్ చేశాడు ఏపీ సీఎం. 


'నీ ముఖంలో ఈ చిరునవ్వు ఎప్పుడూ వుంటుంది... చీకటి రోజుల్లోనూ ఈ చిరునవ్వును చెదరనివ్వలేదు. ఎప్పుడు నాకు నువ్వు ధైర్యమే ..  ప్రజాసేవ చేయాలనే నా తపనను గుర్తించి అందుకోసం 100శాతం సహకారం అందించారు. నా సర్వస్వమా... హ్యాపీ భర్త్ డే'' అంటూ భార్య భువనేశ్వరి హృదయానికి హత్తుకునేలా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు.   ఇంతకంటే ఏ భార్యకైనా ఏం కావాలి... చెప్పండి.