Kalyan Ram: చరణ్ కోసం అనుకున్న టైటిల్ తో కళ్యాణ్ రామ్..? 2024-06-28 10:55:38

న్యూస్ లైన్ డెస్క్: నందమూరి కళ్యాణ్ రామ్ 21వ మూవీ తో మన ముందుకు రాబోతున్నారు.అయితే ఈ సినిమాకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ ని తీసుకున్నట్టు టాలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.ఇక ఈ సినిమా టైటిల్ సంబంధించిన పూర్తి సమాచారం త్వరలోనే బయటపడబోతుంది. అయితే కళ్యాణ్ రామ్ చేస్తున్న సినిమాకి రామ్ చరణ్ టైటిల్ తీసుకోవడం ఏంటి అంటే..రామ్ చరణ్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో అప్పట్లో మెరుపు అనే మూవీకి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.

మెరుపు అనే టైటిల్ తో సినిమా అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కలేదు. అయితే అప్పటినుండి ఇప్పటివరకు మెరుపు సినిమా టైటిల్ ని ఏ హీరో కూడా వాడుకోలేదు. కానీ ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. నందమూరి కళ్యాణ్రామ్ తన 21వ మూవీకి మెరుపు టైటిల్ ని వాడుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం లో అశోక క్రియేషన్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా లో కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో విజయశాంతి పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్టు ఈ మధ్యనే ఆమె బర్త్డే రోజు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. చాలా రోజుల తర్వాత విజయశాంతి మళ్ళీ సినిమాల్లో కనిపిస్తోంది.ఇక ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. మరి నందమూరి కళ్యాణ్ రామ్ మెరుపు సినిమా టైటిల్ ఫిక్స్ చేసారా లేదా అనేది త్వరలోనే బయటపడుతుంది.