Kalki 2898AD: థియేటర్లలో దుమ్ము లేపిన కల్కి.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..? 2024-06-28 11:14:10

న్యూస్ లైన్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న ప్రభాస్ నటించిన కల్కి 2898 AD మూవీ చాలా గ్రాండ్ గా విడుదలైంది.ఇక విడుదలైన మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ప్రభాస్ ఖాతాలో మరో బాహుబలి రికార్డు పడ్డట్లే అని అందరూ అనుకుంటున్నారు.ఇక వారి అంచనాలకు తగ్గట్టే బాక్సాఫీస్ షేక్ చేసి కలెక్షన్లు భారీగా రాబట్టినట్టు తెలుస్తుంది. మరి కల్కి ఫస్ట్ రోజు ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందో ఇప్పుడు చూద్దాం..

మహాభారతంలోని కథను అనుసంధానంగా చేసుకొని  నాగ్ అశ్విన్ ఒక అద్భుతమైన ప్రపంచాన్ని మన ముందు కల్కి  మూవీ రూపంలో చూపించారు. ఈ సినిమాలో ఉన్న విజువల్ వండర్స్ చూస్తూ ఉంటే ఆహా ఓహో అనక మానరు. అయితే కల్కి 2898 ad మూవీ థియేటర్లలో వీర కుమ్ముడు కుమ్మింది.ఇక కొన్ని నివేదికలు తెల్పిన దాని ప్రకారం.. ఈ సినిమా ఫస్ట్ డే రోజు ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలిపి  180 కోట్లకు పైగా గ్రాస్ అందుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు వచ్చిన సినిమాలలో ఈ సినిమా ఫస్ట్ డే రోజు కలెక్షన్ల పరంగా మూడో స్థానంలో ఉంది.

మొదటి స్థానంలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ (223కోట్లు) ఉండగా రెండవ స్థానంలో బాహుబలి( 217 కోట్ల) ఉంది.అలా భారీ అంచనాలతో నాగ్ అశ్విన్  వచ్చినప్పటికీ రాజమౌళి రెండు సినిమాలను ఫస్ట్ డే కలెక్షన్స్ లో బీట్ చేయలేకపోయారు. కానీ ఇండియన్ సినీ హిస్టరీలో కల్కి సినిమా మొదటిరోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల్లో మూడో స్థానంలో నిలిచింది. ఇక కల్కి మూవీ మన ఇండియాలో దాదాపు 95 కోట్ల నెట్, 115 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి.ఏది ఏమైనప్పటికీ కల్కి మేనియా మరో 10,15 రోజులపాటు థియేటర్లలో మనం చూస్తాం