JIO Recharge: భారీగా పెరిగిన జియో రీఛార్జ్ ధరలు 2024-06-27 10:01:30

న్యూస్ లైన్ డెస్క్: జియో ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ ధరలు భారీగా పెరిగింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్ టారిఫ్ రేట్లు పెంచింది. టారిఫ్ రేట్లను భారీగా పెంచుతున్నట్లు గురువారం పత్రికా ప్రకటనలో వెల్లడించింది. కనీసం 12.5 శాతం నుంచి అత్యధికంగా 25 శాతం వరకు రీఛార్జ్ రేట్లు పెరగనున్నాయని తెలిపింది. దాంతో కస్టమర్లపై గణనీయమైన ప్రభావం చూపనుంది. ఇంకా మరోవైపు ఇంకొన్ని కొత్త రీఛార్జ్ ప్లాన్లు పెంపు చేసింది. అయితే ఇదే సమయంలో 5G అన్‌లిమిటెడ్ ప్లాన్లను కూడా పరిచయం చేసింది. సవరించిన కొత్త రీఛార్జ్ ప్లాన్లు 2024, జులై 3 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. పాపులర్ ప్లాన్ల కొత్త రేట్లు ఇలా ఉన్నాయి. నెలవారీ ప్లాన్ల విషయానికి వస్తే 2GB డేటా ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో రూ. 189 కి లభిస్తుంది. డైలీ 1GB డేటాతో 28 రోజుల గడువు ఉన్న ప్లాన్  ఇప్పుడు అది రూ. 249 కి చేరనుంది. ఇక 1.5GB/Day ప్లాన్ రూ. 299కి చేరనుంది.