T20 Worldcup: ఫైనల్ కు భారత్..! 2024-06-28 06:59:46

ఫైనల్ కు భారత్ 

ఇంగ్లాండ్ పై టీమిండియా ఘన విజయం 

హాఫ్ సెంచరీతో చెలరేగిన రోహిత్ 

కుల్దీప్, అక్సర్ బౌలింగ్ షో 

 

 

న్యూస్ లైన్ స్పోర్ట్స్: టీ20 ప్రంపచకప్ సెమీఫైనల్ పోరులో భారత్ ఘన విజయం సాధించింది. గ‌యానాలోని ప్రొవిన్స్ స్టేడియం వేదికగా జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ మ్యాచ్‌లో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించి.. ఫైనల్‌లో అడుగుపెట్టింది. భారత బ్యాటర్లు రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. సూర్య కుమార్ యాదవ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో భారత్, ఇంగ్లాండ్ జట్టుపై 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.  

 

 

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. కింగ్ కోహ్లీ(9)ను రీస్ టోప్లీ పెవిలియన్‌కు పంపాడు. ఆ కాసేపటీకి డేంజరస్ బ్యాటర్ రిషబ్ పంత్(4), సామ్ కరెన్ బౌలింగ్ ఔటయ్యాడు. దాంతో భారత్ రెండు వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. ఇక తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సూర్య కుమార్ యాదవ్ దూకుడు బ్యాటింగ్ చేశాడు. రోహిత్ శర్మతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మరోవైపు రోహిత్ శర్మ హార్డ్ హిట్టింగ్ బ్యాటింగ్ చేశాడు. బౌండరీలు సిక్సర్లు బాదుతూ హిట్ మ్యాన్ ( 37 బంతుల్లో 54 పరుగులు 6 ఫోర్లు, 2 సిక్సర్ల)తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరు స్కోర్ బోర్డుకు 73 పరుగులు జతచేశారు. అయితే రోహిత్(57), ఆదిల్ రషీద్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన హార్దిక్ పాండ్యా మంచి ఇన్నింగ్స్ తో చెలరేగాడు. మరో ఎండ్ లో ఉన్న సూర్య తుఫాన్ బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ బౌలర్లకు ఊచకోత చూపించాడు. కానీ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో సూర్య(47) భారీ షాట్ ఆడబోయే క్రిస్ జోరడోన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక హార్దిక్, జోరడోన్ బౌలింగ్ లో వరుసగా రెండు సిక్సర్ల బాదడు అయితే మూడో సిక్సర్ కొట్టే ప్రయత్నంలో సామ్ కరెన్ కు క్యాచ్ ఇచ్చి పాండ్యా(23) ఔటయ్యాడు. ఆ కాసేపటికే వచ్చిన శివం దూబే డకౌట్ అయ్యాడు. ఇక చివర్లో రవీంద్ర జడేజా(17) మంచి క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టానికి 171 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లు క్రిస్ జోరడోన్ మూడు వికెట్లు పడగొట్టాగా.. సామ్ కరెన్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, రీస్ టోప్లీ తలా ఒక వికెట్ తీశారు. 

 

 భారీ టార్గెట్ ను ఛేదించేందుకు బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టుకు ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ జోస్ బట్లర్(23)ను అక్సర్ పటేల్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత ఫిలిప్ సాల్ట్(4), జాస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ లో ఔటయ్యాడు. జానీ బెయిర్ స్ట్రో() కూడా పెవిలియన్ కు చేరాడు. దీంతో ఇంగ్లాండ్ మూడు వికెట్లు కోల్పోయి 36 రన్స్ స్కోర్ చేసింది. తర్వాత క్రీజులో హరీ బ్రూక్స్ కు దిగాడు. మొయిన్ అలీ తో కలిసి మంచి బ్యాటింగ్ చేశాడు. అయితే మరో ఎండ్‌లో కుల్దీప్‌ చెలరేగడంతో మొయిన్‌ అలీ(8), కరాన్‌(2), బ్రూక్‌, జోర్డాన్‌(1) వెంటవెంటనే నిష్క్రమించారు. స్పిన్నర్ల విజృంభణతో ఇంగ్లాండ్ బ్యాటర్లు కనీసం క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ఆర్చర్‌తో సమన్వయ లోపంతో లివింగ్‌స్టోన్‌(11), రషీద్‌(2) రనౌట్‌ అయ్యార్‌. చివరిలో ఆర్చర్‌(21) పోరాడినా ఫలితం లేకపోయింది. దాంతో ఇంగ్లాండ్ 16.4 ఓవర్ లోనే అలౌట్ అయింది. దీంతో భారత్, ఇంగ్లీష్ జట్టుపై 68 పరుగుల తేడాతో సంచలన విజయం నమోదు చేసింది. టీమిండియా బౌలర్లు అక్సర్ పటేల్, కుల్దీప్‌ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాగా.. జాస్ప్రిత్ బుమ్రా రెండు వికెట్లు తీశాడు.