Nag Ashwin: ఒక్క మాటతో ప్రియాంకని బుట్టలో పడేసిన నాగ్.. వాట్ ఏ లవ్ స్టోరీ..! 2024-06-28 11:50:38

న్యూస్ లైన్ డెస్క్: గత కొద్ది రోజులుగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రభాస్ అభిమానులు. అయితే ఎట్టకేలకు ఈ సినిమాకి సంబంధించి అభిమానులు పెట్టుకున్న అంచనాలన్నీ నిజమైపోయాయి. జూన్ 27న కల్కి సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో ఉన్న గ్రాఫిక్స్, విజువల్స్ చూసిన చాలామంది జనాలు వామ్మో నీ టేకింగ్ స్టైల్ ఏంట్రా బాబు..మూడు సినిమాలకే 30 సినిమాలు తీసిన దర్శకుడి అనుభవంతో చేశావు రా నాయనా అంటూ సినిమా చూసిన సినీ విమర్శకులు సైతం నాగ్ అశ్విన్ దర్శకత్వ ప్రతిభ ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

ఇక సినిమా విడుదలై హిట్ అవ్వడంతో సినిమాకి దర్శకత్వం వహించిన  నాగ్ అశ్విన్ లవ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈయన వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మాత అయినటువంటి అశ్విని దత్ కుమార్తె ప్రియాంక దత్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.అయితే వీరి ప్రేమాయణం ఎలా నడిచింది అంటే.. నాగ్ అశ్విన్ ఇంగ్లీష్ షార్ట్ ఫిలిం అయినటువంటి యాదోంకి బరాత్  కి దర్శకత్వం వహించారు. అయితే ఈ షార్ట్ ఫిలిం కి ప్రియాంక దత్ నిర్మాతగా చేశారు. అలా మొదలైన వీరి స్నేహం ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా సమయంలో ప్రేమగా మారింది.అయితే ఒకరికి ఒకరు లవ్ ఎక్స్ప్రెస్ చేసుకోలేదు.ఈ సినిమాకి ప్రియాంక, స్వప్న  ఇద్దరు నిర్మాతలుగా చేశారు.

ఈ సినిమా అయిపోయాక  ఓసారి ప్రియాంక కి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని తెలిసిన నాగ్ అశ్విన్ తన ప్రేమని ఆపుకోలేక ఇంట్లో సంబంధాలు చూస్తున్నారట కదా.మీకు వాళ్లు ఓకే అయితే వారిని చేసుకోండి..ఒకవేళ నచ్చకపోతే మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటూ సింపుల్గా తనను ప్రేమిస్తున్నాను అనే విషయాన్ని చెప్పేసారట నాగ్ అశ్విన్. ఇక ఆయన చెప్పిన ఈ ఒక్క మాటతో ప్రియాంక నాగ్ బుట్టలో పడిపోయింది. అలా వీరిద్దరి పెళ్లి జరిగింది. ఇక వీరికి ఒక బాబు కూడా ఉన్నారు. ప్రస్తుతం ప్రియాంక దత్ వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మాణ రంగంలో కీలక పాత్ర పోషిస్తూ సినీ ఇండస్ట్రీలో కొనసాగుతోంది