T20 Worldcup: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. భారత్‌తో సెమీస్ ఫైట్ 2024-06-27 21:12:54

న్యూస్ లైన్ స్పోర్ట్స్: టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ గ‌యానాలోని ప్రొవిన్స్ స్టేడియం వేదికగా జరుగుతుంది. అయితే వర్షం కార‌ణంగా టాస్‌ను రాత్రి 8:50 గంట‌ల‌కు వేశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ సారథి జోస్ బ‌ట్ల‌ర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మెగా టోర్నీలో భారత్ అజేయంగా దూసుకెళ్లుంది. ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించి ఫైనల్‌లో అడుగుపెట్టాలని రోహిత్ సేన భావిస్తోంది. కాగా, అటూ ఇంగ్లాండ్ భారత్‌కు గట్టి పోటీ ఇస్తుంది. దాంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా జరగనుంది.


జట్టు వివరాలు
భార‌త జ‌ట్టు : రోహిత్ శ‌ర్మ‌(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిష‌భ్ పంత్(వికెట్ కీప‌ర్), సూర్య‌కుమార్ యాద‌వ్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, ర‌వీంద్ర జ‌డేజా, అక్ష‌ర్ ప‌టేల్, కుల్దీప్ యాద‌వ్, జ‌స్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.

ఇంగ్లండ్ జ‌ట్టు : ఫిలిప్ సాల్ట్, జోస్ బట్ల‌ర్(కెప్టెన్, వికెట్ కీప‌ర్), జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, లియాం లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, సామ్ క‌ర‌న్, జోఫ్రా ఆర్చ‌ర్, ఆదిల్ ర‌షీద్, క్రిస్ జోర్డాన్, టాప్లే.