Chaganti: చాగంటికి మరో పదవిని అప్పగించిన ఏపీ ప్రభుత్వం !

ముఖ్యమంత్రి చంద్రబాబు , మంత్రి నారా లోకేశ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత ఆయన బాధ్యతలను స్వీకరించారు.


Published Dec 21, 2024 04:57:00 PM
postImages/2024-12-21/1734780475_images.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటీశ్వరరావు ని విద్యార్ధులు - నైతిక విలువల సలహాదారుగా ఏపీ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. అయితే కేబినేట్ హోదా కలిగిన ఈ బాధ్యతను చాగంటికి ఏపీ ప్రభుత్వం అప్పగించింది. రీసెంట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు , మంత్రి నారా లోకేశ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత ఆయన బాధ్యతలను స్వీకరించారు.


దీనితో పాటు ఏపీ ప్రభుత్వం మరో బాధ్యతను చాగంటికి అప్పగించారు.  విద్యార్థుల్లో నైతిక విలువలను పెంచేందుకు చాగంటితో ప్రభుత్వం ప్రత్యేకంగా పుస్తకాలను తయారు చేయించి, విద్యార్థులకు పంపీణీ చేయనుంది. రెండు రోజుల క్రితం కేబినేట్ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేబినేట్ నిర్ణయం మేరకు చాగంటికి అదనపు బాధ్యతలు అప్పగించారు.


ఈ బాధ్యతలను స్వీకరిస్తున్నట్టు చాగంటి తెలిపారు. పిల్లలకు ఉపయోగపడేలా నాలుగు మంచి మాటలు చెప్పాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలను స్వీకరిస్తున్నానని చెప్పారు. పదవుల కోసం తాను ఒప్పుకోలేదని... తన మాటలతో పిల్లలకు మేలు జరిగితే చాలని అన్నారు. తరువాతి తరం మంచి దారిలో నడిచింది ..ఉన్నతమైన జీవితాలను అనుభవించడానికి ఇది సహాయపడుతుందంటే నాకు సంతోషం గా కూడా ఉందని తెలిపారు చాగంటి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu ap chaganti-kotiswarao

Related Articles