health: బ్యాడ్ కొలస్ట్రాల్ కు ఇలా చెక్ పెట్టండి !

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలంటే తప్పకుండా మీ డైట్ లో మార్పులను చేసుకోవాలి. అప్పుడే కొలస్ట్రాల్ అదుపులో ఉంటాయి.


Published Mar 26, 2025 07:13:00 PM
postImages/2025-03-26/1742996679_120090023681878thumbnail16x9badcholesterolreducingfoods.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఆరోగ్యమే మహాభాగ్యం ..ఇప్పుడంతా వెంపర్లాడుతుంది కూడా దీనికే. ఈ రోజుల్లో కొలస్ట్రాల్ సమస్య కూడా చాలా ఎక్కువ వినిపిస్తుంది. అయితే కొలెస్ట్రాల్ శాతం ఎక్కువ అవ్వడం వలన గుండెకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలంటే తప్పకుండా మీ డైట్ లో మార్పులను చేసుకోవాలి. అప్పుడే కొలస్ట్రాల్ అదుపులో ఉంటాయి.


* మీ డైట్ లో భాగంగా ఫైబర్ ను ఎక్కువగా తీసుకోవడం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. 


* బీన్స్, ఓట్స్, పప్పులు, అవిస గింజలు వంటి వాటిలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది.


* డీప్ ఫ్రై తినకండి. వాటి వలన శరీరంలో శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ మరియు ట్రాన్స్ ఫ్యాట్స్ పెరిగిపోతాయి. ఈ విధంగా చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. 


* క్వినోవా , టోపు , బీన్స్ , పప్పులు వంటి ఆహార పదార్ధాలలో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. ఈ విధంగా ప్లాంట్ బెస్ట్ ప్రోటీన్ తీసుకొండి.


* వైట్ బ్రెడ్స్, చాక్లెట్స్ , డ్రింక్స్ వంటి వాటిని వెంటనే ఆపేయాలి.


* నమిలి తినేవి తినండి...తాగేవి మానేయండి..అంటే జ్యూస్ లు మానేయాలి. నమిలి తినేవి అంటే పీచు పదర్ధాలు తీసుకోవాలి. ఇలా అయితే కొలస్ట్రాల్ తగ్గుతాయి.
 

newsline-whatsapp-channel
Tags : health healthy-food-habits cholesterol

Related Articles