BADRADI: ఏంటి ఈ అపచారం ...పాడైపోయిన రాములోరి తలంబ్రాలు !

ముత్యాలను అక్కడి సిబ్బంది వేరు చేస్తున్నారు. మొత్తంగా సుమారు ఐదు క్వింటాళ్ల తలంబ్రాల వరకు పాడైపోయినట్లు అధికారులు


Published Mar 13, 2025 06:57:00 PM
postImages/2025-03-13/1741872543_MuthyalaTalambraluPreparationBhadrachalamnowatermark.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయంలో అధికారులు , సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా లక్షల విలువ చేసే ముత్యాల తలంబ్రాలు పాడైపోయాయి. గత ఏడాది స్వామి వారి తలంబ్రాలు ..ముత్యాల తలంబ్రాలు చాలా ప్యాకెట్లు పక్కన పెట్టి అమ్ముతున్నరు. అయితే ఆ ప్యాకెట్లు లోపం బియ్యం పాడైపోయి పురుగులు చేరాయి. ప్యాకెట్ల లోపల పాడైన తలంబ్రాలను , ముత్యాలను అక్కడి సిబ్బంది వేరు చేస్తున్నారు. మొత్తంగా సుమారు ఐదు క్వింటాళ్ల తలంబ్రాల వరకు పాడైపోయినట్లు అధికారులు చెబుతున్నారు.

పాడైన ప్యాకెట్లు లక్ష వరకు ఉంటాయని సమాచారం అందగా, ఆలయ అధికారులు మాత్రం 28 వేలని చెబుతున్నారు.
వాటి విలువ ఒక్కో ప్యాకెట్  రూ.25గా నిర్ణయించారు. ఈ ప్యాకెట్లను కొరియర్, పోస్టల్‌ ద్వారా నగదు చెల్లించిన భక్తులకు ఆలయ సిబ్బంది పంపిస్తారు. తలంబ్రాల ప్యాకెట్ల లోపల ముత్యాలను మాత్రం మళ్లీ వాడాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం పాడైన తలంబ్రాల ప్యాకెట్లలోని బియ్యాన్ని ముత్యాలను వేరు చేయడం సిబ్బందికి పెద్ద భారంగా మారింది.ఏప్రిల్ 6 న జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణానికి ఆలయ అధికారులు కళ్యాణ పనులు చేపట్టారు.


అయితే ఈ ప్యాకెట్లు మరో సారి ఎండలో వేసి ...వీటిని భక్తులకు ఫ్రీగా అందిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించకూడదని ఆలయ అధికారులు అనుకుంటున్నారు.  సాధారణంగా బియ్యం ఎక్కువ రోజులు నిల్వ ఉంటే సుమారు 50 క్వింటాల్ల ముత్యాల తలంబ్రాలు పాడైపోవడంతో అప్పటి అధికారులు పాడైపోయిన ముత్యాల తలంబ్రాలను పురుషోత్తపట్నంలోని గోశాలలో పెద్ద గొయ్యి తీసి భూమిలో పారబోశారు. ప్రస్తుతం ఇప్పుడు కూడా లక్షల విలువ చేసే తలంబ్రాలు పాడైపోయాయి. అయితే పాడైన తలంబ్రాల బియ్యాన్ని పడవేయకుండా మళ్లీ భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తామని ఆలయ అధికారులు చెబుతున్నారు. అలా పాడైన తలంబ్రాలను పంపిణీ చేస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu sriram

Related Articles