tirumala: తిరుమలలో పెనుప్రమాదం ...విరిగిన రైలు పట్టాలు !

ప్రమాదవశాత్తు పట్టా విరిగిందా లేక కుట్ర ఏమైనా ఉందా కోణంలో విచారణ చేస్తున్నారు రైల్వే పోలీసులు .


Published Mar 09, 2025 01:01:00 PM
postImages/2025-03-09/1741505615_southcentralrailwaycancelssixtrainsdivertsnineothersintelanganacheckfulllisthere.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : తిరుపతి జిల్లాలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా గూడూరు సమీపంలో రైలు పట్టాలు విరిగాయి. గొర్రెల కాపరి గమనించి ఎర్రటవాలు కట్టడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు రైలును నిలిపివేశారు. దీంతో విజయవాడ తిరుపతికి వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టాలు ప్రమాదవశాత్తు విరిగిందా ..లేక కుట్ర ప్రకారమే చేసిందా అనే కోణంలో రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదవశాత్తు పట్టా విరిగిందా లేక కుట్ర ఏమైనా ఉందా కోణంలో విచారణ చేస్తున్నారు రైల్వే పోలీసులు . అటు ట్రాక్ కు మరమ్మత్తులు చేయిస్తున్నారు అధికారులు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu railway-department tirupati

Related Articles