విశాఖవాసులకు ఈ లైట్ హౌస్ ఓ మంచి మెమొరీ . ఎన్నో వేల సినిమాల్లో ఈ లైట్ హౌస్ కనిపించింది. దీనికి గతంలో పలుమార్లు మరమ్మతులు చేశారు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : విశాఖ అనగానే అందరికి గుర్తుకు వచ్చేది లైట్ హౌస్. దాదాపు ఆరు దశాబ్దాల పాటు ఈ లైట్ హౌస్ ఎనలేని సేవలు అందించింది.1903 లో లైట్ హౌస్ ను నిర్మించారు. 1962 లో అది సేవలకు దూరమయ్యింది. విదేశీ నౌకలు విశాఖ తీరానికి చేరుకునేలా ఈ లైట్ హౌస్ ను నిర్మించారు. సముద్రంలో 12 మైళ్ల దూరంలోని నౌకలకు కనిపించేలా ప్రతి 2 నిమిషాలకు ఒకసారి వెలుగు విరజిమ్మేది.
విశాఖవాసులకు ఈ లైట్ హౌస్ ఓ మంచి మెమొరీ . ఎన్నో వేల సినిమాల్లో ఈ లైట్ హౌస్ కనిపించింది. దీనికి గతంలో పలుమార్లు మరమ్మతులు చేశారు. లైట్ హౌస్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో దీన్ని కూల్చేస్తారనే ప్రచారం జరుగుతోంది. విశాఖ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్న లైట్ హౌస్ ను పరిరక్షించాలని నగరవాసులు కోరుతున్నారు. కూల్చేయడం లాంటి వాటిని మరోసారి ఆలోచించాలంటున్నారు విశాఖ వాసులు.