ఈ నేపథ్యంలో జగన్ కు ప్రతిపక్ష నేత హోదా అంశంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని వైసీపీ అధినేత జగర్ చెబుతున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నేత హోదా ఉంటేనే సభలో ఎక్కువ టైం మాట్లాడే అవకాశం ఉంటుందని ఆయన అంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కు ప్రతిపక్ష నేత హోదా అంశంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.
కనీసం 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా రాదని చట్టం చెబుతుందని అయ్యన్నపాత్రుడు తన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా కోసం జగన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. సభాపతికి ఇలాంటి దురుద్దేశాలు ఆపాదించడం అంటే సభానియమాళలను ఉల్లంఘించడమే అవుతుంది. జగన్ అన్నీ తెలిసే అబద్దాలు ఆడుతున్నారని అన్నారు. అయితే ఆయనను క్షమించి వదలేస్తున్నామని తెలిపారు. జగన్ మాటలను ప్రేలాపనలుగా భావించి వదిలేస్తున్నామని తెలిపారు.