MOON: చంద్రుడిపై దిగిన బ్లూ ఘోస్ట్...అసలు ఏంటి ఈ వింత !

 మార్చి 14న సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది. దీంతో ఈసారి మెరుగైన చిత్రాలను దీని ద్వారా సంగ్రహించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు


Published Mar 06, 2025 05:54:00 PM
postImages/2025-03-06/1741263961_blueghost02572235916x90.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : సూర్యాస్తమయం కాగానే ఆకాశంలో అల్లంత దూరాన అందంగా ..కనిపించే చందమామ పై ఎన్నో వేల వింతలు ..అధ్భుతాలు...అంతేకాదు  ఇప్పటివరకూ భారతదేశం, అమెరికా, రష్యా, చైనా, జపాన్‌లతో సహా ప్రపంచంలోని ఐదు దేశాలు మాత్రమే చంద్రునిపై ప్రయాణించగలిగాయి. అయితే రీసెంట్ గా ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన ల్యాండర్ చంద్రుడిపై సేఫ్ గా దిగి చరిత్ర సృష్టించింది.


మార్చి 2వ తేదీన అమెరికాలోని ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ సంస్థకు చెందిన ఈ బ్లూ ఘోస్ట్ మిషన్-1.. మోన్స్ లాట్రైల్ సమీపంలో ల్యాండ్ అయింది. ఇది మూన్ ని ఈశాన్య భాగంలో మారే క్రిసియాలో ఉన్న అగ్ని పర్వత నిర్మాణం . దీంతో ఈ ఫ్లైట్ ఎన్నో గండాలను తట్టుకొని అక్కడ సేఫ్ గా ల్యాండ్ అవడంతో వెంటనే మిషన్ టీమ్ ఆనందంలో ఎగిరి గంతులేసింది. ఇది చంద్రయాన్ -3 సాధించినంత గొప్ప కాదు కాని ఫస్ట్ ట్రైల్ లో చందమామపై సేఫ్ గా ల్యాండ్ అయిన తొలి ప్రైవేట్ ల్యాండర్ గా ఈ బ్లూ ఘోస్ట్ రికార్డ్ క్రియేట్ చేసింది.


గతంలో చాలా ప్రైవేట్ సంస్థలు చంద్రునిపై ల్యాండర్లను దింపేందుకు ప్రయత్నించి విఫలమయ్యాయి. అయితే చంద్రుడిపై ల్యాండ్ అయ్యే సమయంలో అదుపు తప్పడం, కూలిపోవడం, క్రాష్ ల్యాండింగ్, ఒరిగిపోవడం జరిగాయి. కాని ఈ సారి మాత్రం సేఫ్ గా ల్యాండ్ అయ్యారు.


 మార్చి 14న సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది. దీంతో ఈసారి మెరుగైన చిత్రాలను దీని ద్వారా సంగ్రహించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇక నాలుగు కాళ్ల ఈ గోల్డెన్ ల్యాండర్ 2 మీటర్ల ఎత్తు, 3.5 మీటర్ల వెడల్పుతో ఒక చిన్న కారు సైజులో ఉంటుంది. ఈ బ్లూ ఘోస్ట్ చంద్రుని పై ధూళిని టెస్ట్ చేయనుంది. చంద్రుని పై 10 అడుగుల లోతు రంధ్రం చేసి అక్కడ మట్టి తీశారు. ఇందుకోసం ఈ బ్లూ ఘోస్ట్ చంద్రుని మట్టిని టెస్ట్ చేస్తారు, దీంతో పాటు నాసా ఆస్ట్రానాట్స్ స్పేస్ సూట్ పై పేరుకుపోయిన చంద్రధూళిని దులిపే డివైజ్ పనితీరును కూడా అక్కడ పరీక్షించనుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu landing america moon

Related Articles