KTR: ఫిరాయింపు ఎమ్మెల్యేకు  ఛైర్మన్ పదవా 

పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేకు పీఏసీ ఛైర్మన్ పదవి ఇవ్వడం సిగ్గు చేటు అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.


Published Sep 09, 2024 07:53:09 PM
postImages/2024-09-09/1725891789_conbar.PNG

న్యూస్ లైన్ డెస్క్: పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేకు పీఏసీ ఛైర్మన్ పదవి ఇవ్వడం సిగ్గు చేటు అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజే ఇదేం దుర్మార్గమని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ ఛైర్మన్ హోదాను, పార్టీ మారిన ఎమ్మెల్యేకు కట్టబెట్టడం ఎక్కడి సంస్కృతి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నిలదీశారు. 

గీత దాటిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని పూర్తిగా కాలరాస్తోందని మండిపడ్డారు. సంప్రదాయాలను మంటగలుపుతోందని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేసీ వేణుగోపాల్‌కు కట్టబెట్టిన విషయం మరిచారా అని ప్రభుత్వాన్నికి గుర్తు చేశారు. దేశ అత్యున్నత చట్టసభలో ఒక న్యాయం? రాష్ట్ర అత్యున్నత చట్టసభలో మాత్రం అన్యాయమా అని కేటీఆర్ ధ్వజమెత్తారు.

newsline-whatsapp-channel
Tags : india-people fire mla brs ktr cm-revanth-reddy congress-government

Related Articles