హిందూమతంలో తల్లిదండ్రులను దేవునితో సమానంగా చూస్తారు. కాబట్టి ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లే ముందు తమ తల్లిదండ్రులను అనుమతి తీసుకోవడం తప్పనిసరి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ ; అక్షయ తృతీయ రోజు నుంచే చార్ ధామ్ యాత్ర మొదలవుతుంది. చార్ ధామ్ యాత్ర యమునోత్రి నుంచి ప్రారంభం అవుతుంది. ప్రతి యేడాది కొన్ని లక్షల మంది భక్తులు చార్ ధామ్ యాత్రకు తరలివెళ్తుంటారు. అయితే ఈ ప్రయాణంలో చాలా నియమాలున్నాయి. తెలీకుండా వెళ్తే అక్కడికి వెళ్లాక చాలా ఇబ్బందులు పడతారు.
హిందూమతంలో తల్లిదండ్రులను దేవునితో సమానంగా చూస్తారు. కాబట్టి ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లే ముందు తమ తల్లిదండ్రులను అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఈ నియమాలు పురాణాలు చెప్పినవి . కాబట్టి యాత్రకు వెళ్లాలంటే పేరెంట్స్ ఒప్పుకోవల్సిందే. చార్ ధామ్ యాత్ర సమయంలో మాంసాహార ఆహారానికి దూరంగా ఉండాలి. ఈ మొత్తం ప్రయాణంలో ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసం, మద్యం నుంచి దూరంగా ఉండాలి. సాత్విక ఆహాయంతో ఈ యాత్ర ప్రయాణంలో మీకు చాలా సాయం చేస్తుంది.
యాత్ర సమయంలో ఎప్పుడు భగవంతుడిని స్మరిస్తూ ధ్యానిస్తూ ఉండాలి. ప్రయాణంలో తప్పుడు ఆలోచనలు చేయకూడదు. చార్ ధామ్ యాత్ర మళ్లీ మళ్లీ చెయ్యలేరు . చక్కగా మనసు శాంతిగా చూడండి.
సనాతన ధర్మ విశ్వాసాల ప్రకారం ఎవరి ఇంట్లో అయినా మరణించినట్లయితే సూతక కాలం 12నుంచి 13 రోజుల వరకు ఉంటుంది. సూతకాలంలో మతపరమైన తీర్థయాత్రలు చేయడం నిషిద్ధం. అలా కాదని చేస్తే యాత్రకు వెళ్లిన పుణ్యఫలం మీకు కాదు చనిపోయిన వారికి దక్కుతుంది.
చార్ ధామ్ యాత్ర సమయంలో ధరించే బట్టలు శుభ్రంగా ఉంచుకోవాలి. మెత్తగా ఉన్న బట్టలు చూసుకొని వేసుకొండి. అసలే ఎండలు కాబట్టి కంఫర్ట్ గా ఉన్న బట్టలు వేసుకొండి.