Study:వచ్చే ఐదేళ్లలో డిమాండ్ ఎక్కువున్న కోర్సులు..జాబ్ పక్కా.!

దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని అంటారు. అలాంటి యువతే దేశాన్ని ఏ రంగంలో అయినా దూసుకెళ్లేలా చేయగలరు.  అలాంటి యువకులు ఏ దేశంలో లేని విధంగా భారతదేశంలో


Published Aug 26, 2024 12:54:00 PM
postImages/2024-08-26/1724654700_AITECH.jpg

న్యూస్ లైన్ డెస్క్:దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని అంటారు. అలాంటి యువతే దేశాన్ని ఏ రంగంలో అయినా దూసుకెళ్లేలా చేయగలరు.  అలాంటి యువకులు ఏ దేశంలో లేని విధంగా భారతదేశంలో ఉన్నారు. వారికి ఉపాధి కల్పిస్తే దేశాన్ని మంచి రేంజ్ లో ఎదిగేలా చేయగలరు. కానీ ఇండియాలో రాజకీయ పార్టీలు, నాయకులు ఆ విధమైన దిశలో ఆలోచించడం లేదు, ఉచితల పేరుతో ప్రతి ఒక్కరిని సోమరిలను చేసి దేశాన్ని వెనుకబడేలా చేస్తున్నారు. మరి అలాంటి దేశ యువత పీజీలు, పిహెచ్ డీలు చేసిన కమ్యూనికేషన్ స్కిల్స్ లేక ఉద్యోగాలు రావడం లేదు.

అదే రొటీన్ చదువులు, చదువుకుంటూ ఖాళీగా ఇంటివద్దే ఉంటున్నారు. అలా దేశ భవిష్యత్తును కాపాడే యువత ఎలాంటి రంగంలో అడుగుపెడితే రాబోవు ఐదు పదేళ్లలో భవిష్యత్తు ఉంటుందా ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రపంచ దేశాల్లో ఎక్కువగా మ్యాన్ పవర్ లేకుండానే టెక్నాలజీ ద్వారా ఎన్నో వర్క్ చేస్తున్నారు. అలాంటి ఏఐ టెక్నాలజీని దేశ యువత నేర్చుకుంటే భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించవచ్చు. అలా ఏఐ టెక్నాలజీని అద్భుతంగా విస్తరించేందుకు ఏఐసిటిఈ  విశేషంగా పనిచేస్తోంది..  ముఖ్యంగా ఇందులో సైబర్ సెక్యూరిటీ, ఏఐ కోర్సులకు ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాదు ఈ కోర్సులను ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా పెంచుతున్నారట.

ఈ విషయాన్ని ఏఐసిటీఈ సంస్థ చీఫ్ కోఆర్డినేటర్  ఆఫీసర్ బుద్ధ చంద్రశేఖర్ తెలియజేస్తున్నారు. భవిష్యత్తులో సైబర్ కి సంబంధించిన నేరాలు ఎక్కువగా పెరిగిపోతాయని వాటి నుంచి కాపాడుకునేందుకు సైబర్  సెక్యూరిటీ వాళ్ళు ఎక్కువగా అవసరం పడతారని, కాబట్టి సెక్యూరిటీకి సంబంధించిన కోర్సులు నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన అంటున్నారు.

ప్రతి సంవత్సరం సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాలు చేసేవారు 50 లక్షల మందికి పైగా  అవసరమవుతారట. కంప్యూటర్ సైన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి కోర్సులను ఎక్కువగా ఇంజనీరింగ్ కాలేజీలో బోధించడానికి ఆసక్తి చూపిస్తున్నారట.  భవిష్యత్తులో చదువుకునే యువత ఈ కోర్సుల పైన ఎక్కువ దృష్టి పెడితే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా పెరిగే ఆస్కారం ఉందని టెక్నాలజీ నిపుణులు అంటున్నారు. కాబట్టి విద్యార్థులు ఆలోచన చేయకుండా ఇలాంటి కోర్సులనే ఎక్కువగా చదవడానికి ముందుకెళ్లాలని తెలియజేస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : news-line ai-technology cyber-security engineering meshion-learning

Related Articles