tirumala: తిరుపతి మెట్ల మార్గంలో భక్తుడి మృతి !

భక్తుడిని చంద్రగిరి ఏరియా ఆసుపత్రి తరలించగా అప్పటికే వెంకటేష్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.


Published Feb 19, 2025 10:51:00 AM
postImages/2025-02-19/1739942614_1525430srivarimettu.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆలయానికి నిత్యం వేల మంది కాలినడకన స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాలే కాదు..శ్రీవారి దర్శనార్థం కాలినడకన తిరుమలకు వస్తున్న ఓ భక్తుడు అనుకోకుండా గుండెపోటుకు గురై మరణించాడు. మృతుడిని తెలంగాణ వాసిగా గుర్తించారు.రెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన వెంకటేశ్‌(50) కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి శ్రీవారి మెట్టు మార్గంలో నిన్న ఉదయం తిరుమలకు బయలుదేరాడు. తిరుమల మొదటి మెట్లు నుంచే కాస్త నలతగా ఉందన్న వెంకటేశ్ ...400 వ మెట్టు దగ్గర ఒక్కసారిగా చాతి నొప్పితో కుప్పకూలిపోయాడు. వెంటనే భక్తుడిని చంద్రగిరి ఏరియా ఆసుపత్రి తరలించగా అప్పటికే వెంకటేష్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu heart-attack tirumala

Related Articles