ఈ వెహికల్స్ తిరుపతి బస్టాండ్ , రైల్వేస్టేషన్ నుంచి అలిపిరి మీదుగా శ్రీవారి మెట్టు వరకు యాత్రికులను తీసుకెళ్లాలని చైర్మన్ బీ ఆర్ నాయుడు నిర్ణయించినట్లు తెలుస్తుంది
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రతిరోజుల లక్షలాది మంది భక్తులు తిరుమల కొండకు చేరుకుంటారు. అయితే కొంతమంది భక్తులు తమ మొక్కులు చెల్లించుకునేందుకు కాలినడకన వెళ్తుంటారు. అలాంటి భక్తులకు శుభవార్త వినిపించనుంది టీటీడీ. శ్రీవారి దర్శనార్ధం తిరుపతి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకునే భక్తుల కోసం 20 ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీ ఉచితంగా నడపనుంది. ఈ వెహికల్స్ తిరుపతి బస్టాండ్ , రైల్వేస్టేషన్ నుంచి అలిపిరి మీదుగా శ్రీవారి మెట్టు వరకు యాత్రికులను తీసుకెళ్లాలని చైర్మన్ బీ ఆర్ నాయుడు నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే టీటీడీ ఆధ్వర్యంలో ఫ్రీ ధర్మరధం బస్సులను ఏర్పాటు చేసినా భక్తుల రద్దీకి అనుగుణంగా లేవు. కాబట్టి దాతల సహాకారంతో బస్సులను కొనుగోలు చేసే విధంగా నిర్ణయం తీసుకుంటారని సమాచారం.