ANAKAPALLI: శ్రమజీవుల కష్టార్జితం.. సమాజ హితం కోసం 2024-06-30 10:56:03

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రభుత్వాలు..నాయకులు ఎవ్వరు ఏం చెయ్యరు..ఎవరో వస్తారు..ఏదో చేస్తారు..తమ ఊరి కోసం ఏదో చేసేస్తారనే నమ్మకం పల్లె జనాలకు ఎప్పుడో పోయింది. కుదిరితే చేసుకుంటాం...లేదా ...ఎదురుచూస్తాం..అంతేకాని నాయకుల మనసు కరిగి చేస్తారనుకునేంత వెర్రి వాళ్లం కాదంటున్నారు ఈ గ్రామస్థులు.

ఎవరో వస్తారని, ఏదో చేస్తారని అనుకోకుండా తమ ఊరి కోసం.. తామే ఒక్కో పని మొదలు పెట్టారు. తమ కార్మిక సంఘం మిగులు నిధులను కేటాయించి తమ ఊరి బాధ్యతను తమపై వేసుకున్నారు. ముందుగా స్కూల్ కి వెళ్ళే పిల్లల కోసం, బాటసారులు సేద తీరేందుకు బస్ స్టాప్ నిర్మించుకున్నారు.  నీలాద్రిపురం. అనకాపల్లి ( ANAKAPALLI) జిల్లాలో ఉన్న ఎస్ రాయవరం( S RAYAVARAM)  మండలంలోని గ్రామం ఇది. చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు ఆదర్శంగా నిలిచిన ఈ ఊరి కార్మిక సంఘాన్ని పలువురు పెద్దలు మెచ్చుకుంటున్నారు . ఎవరైనా ఈ ఊరు నుంచి బయటకు వెళ్లాలంటే దాదాపు మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు నడవాల్సిందే. అందుకే ఈ బస్టాప్ నిర్మాణం చేపట్టారు. ఇది చూసిన పలువురు పెద్దలు మెచ్చుకుంటున్నారు. 

ఇంతకు ముందు ఏ నాయకునికి ఈ ఊరికి బస్ స్టాప్ వెయ్యాలనే ఆలోచనే రాలేదు. ప్రజల ఇబ్బందులు కనిపించలేదు. ఓట్ల కోసం అడిగినపుడు మాత్రం బస్ స్టాప్ ,రోడ్లు, డవలప్ మెంట్ కోసం మాట్లాడతారు..తర్వాత కనిపించరు. అందుకే ఎవరి కోసమో ఎదురు చూడకుండా తమ బస్ స్టాప్ ను తమ సొంత డబ్బులతో కట్టుకున్నారు.శ్రీ సీతారామాంజనేయ కార్మిక సంఘం తమ సొంత నిధులను ఇలా సమాజం కోసం వినియోగించుకుంది. సుమారు 70 వేల రూపాయలు ఖర్చు చేశారు కార్మికులు.