postImages/2024-07-02/1719923904_jspmla.jfif

AP: ఎమ్మెల్యేకు జనసైనికులు గిఫ్ట్.. ఏం ఇచ్చారంటే?

2024-07-02 18:08:24

న్యూస్ లైన్ డెస్క్: పోలవరం ఎమ్మెల్యేకు జనసైనికులు కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పేద కుటుంబం నుండి రావడంతో అతని దగ్గర నియోజకవర్గంలో తిరగడానికి కారు లేకపోవడంతో జనసైనికులు ఫార్చునర్ కారును బహుమతిగా ఇచ్చారు. జనసేన పార్టీలో సామాన్య కార్యకర్తగా ఆయన చేరారు. ఆస్తులు లేవు, రేకుల షెడ్డులో నివాసం ఉంటున్నారు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అవకాశం కల్పించారు. దాంతో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచినా సొంత కారు కూడా లేని పరిస్థితి దాంతో నియోజకవర్గ జనసైనికులు అందరూ కలిసి 10 లక్షలు విరాళాలుగా పోగేసి, డౌన్ పేమెంట్ కట్టి ఫార్చునర్ కారును ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు ఇచ్చారు. మిగిలిన డబ్బును నెలనెలా ఈఎంఐ రూపంలో ఎమ్మెల్యే బాలరాజు చెల్లించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇక కారు గిఫ్ట్‌గా ఇచ్చిన జనసైనికులకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.